ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక!

25 Jul, 2021 20:56 IST|Sakshi

ఎస్‌బీఐ తన ఖాతాదారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కొత్త నిబందనలు తీసుకువచ్చింది. ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లతో పాటు ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ యోనో వినియోగదారులు అనుసరించాల్సిన కఠినమైన నిబంధనలతో ఈ సారి ముందుకు వచ్చింది. ఆన్‌లైన్ లో అనేక మోసాల కారణంగా చాలా మంది డబ్బు నష్టపోతున్నట్లు పేర్కొంది. తమ ఖాతాదారులను సురక్షితంగా ఉంచడం కొరకు బ్యాంకు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. 

కొత్త నిబంధనలను పాటించనట్లయితే ఖాతాదారులను వారి ఖాతాల నుంచి స్తంభింపజేస్తుంది. ఎస్‌బీఐ యోనో యాప్ లోకి లాగిన్ కావడానికి ముందు ఎస్‌బీఐ అకౌంట్ ఖాతాదారులు బ్యాంకుతో లింకు చేసిన మొబైల్ ఫోన్ నెంబరు గల మొబైల్ ద్వారానే ఎస్‌బీఐ యోనో యాప్ లో లాగిన్ చేయాలి. ఒకవేళ వేరే నెంబరుతో లాగిన్ చేయడానికి ప్రయత్నించినట్లయితే ఖాతాదారులు ఎలాంటి లావాదేవీ చేయడానికి ఎస్‌బీఐ యోనో అనుమతించదు. ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించింది. "యోనో ఎస్‌బీఐతో బ్యాంక్ సురక్షితంగా ఉంది! యోనో ఎస్‌బీఐ తన భద్రతా ఫీచర్లను మెరుగు పరుస్తుంది. కొత్త అప్డేట్ లో భాగంగా బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబరు గల ఫోన్ నుంచి మాత్రమే యోనో ఎస్‌బీఐని యాక్సెస్ చేసుకోవడానికి అనుమతిస్తుంది" అని తెలిపింది.

>
మరిన్ని వార్తలు