ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్‌ చేస్తాం..అదే కారు కావాల్సిందే’

19 Nov, 2022 21:29 IST|Sakshi

దేశంలో కార్ల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. చిరు ఉద్యోగి నుంచి బడా వ్యాపార వేత్తల వరకు మార్కెట్‌లో విడుదలై, తమకు నచ్చిన డిజైన్‌, ఫీచర్లు ఉంటే చాలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

దీంతో నిన్న మొన్నటి వరకు కొనుగోలు దారులు లేక వెలవెబోయిన కార్ల షోరూంలు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. అందుకే కొనుగోలు దారుల డిమాండ్లకు అనుగుణంగా వాహన తయారీ సంస్థలు వెహికల్స్‌ను మ్యాన్సిఫ్యాక‍్చరింగ్‌ చేసి మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. 

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా స‍్కార్పియో మోడల్‌ను అప్‌ డేట్‌ చేస్తూ మహీంద్రా స్కార్పియో-ఎన్‌, మహీంద్రా ఎక్స్‌ యూవీ-700 లేటెస్ట్‌ వెర్షన్‌లను పరిచయం చేశాయి. అయితే పైన పేర్కొన్న మహీంద్రా వెహికల్‌ కార్లను బుక్‌ చేసుకుంటే సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిప్‌ల కొరత, సప్లయ్‌ చైన్‌లో అవరోధాలతో పాటు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. దీంతో మహీంద్రా ఎక్స్‌యూవీ700, మహీంద్రా స్కార్పియో-ఎన్‌ వెయిటింగ్ పీరియడ్‌ 18- 20 నెలల మధ్య ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

బుకింగ్‌లో రికార్డులు 
నవంబర్ 2022 నాటికి మహీంద్రా ఎక్స్‌యూవీ 700, మహీంద్రా స్కార్పియో-ఎన్‌ల కోసం నెలకు 8,000-9,000 బుకింగ్‌లు అవుతండగా.. ఈ నెలలో 2.60 లక్షల కంటే ఎక్కువ ఓపెనింగ్‌ బుకింగ్స్‌ ఉన్నాయి.  వీటిలో ఈ రెండు ఎస్‌యూవీల బుకింగ్స్‌ 1.30 లక్షలుగా ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్‌ (క్లాసిక్‌తో సహా) 1,30,000 మొత్తం ఓపెన్ బుకింగ్‌లతో అగ్రస్థానంలో ఉంది. కొత్త మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తున్న ఈ కారు ప్రారంభ ధర రూ. 15.45 లక్షలుగా ఉంది.

చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్‌ మహీంద్రా రీ ట్వీట్‌ వైరల్‌!

మరిన్ని వార్తలు