యూట్యూబ్‌కు భారీ షాక్‌..! పడిపోతున్న యూజర్లు!

27 Apr, 2022 13:24 IST|Sakshi

గత కొన్ని నెలలుగా టెక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లను రెండు అంశాలు తీవ్రంగా ఆందోళన గురిచేస్తున్నాయి. ఐఫోన్‌ ద్వారా ఫేస్‌బుక్‌లో అడ్వటైజింగ్‌ చేసేందుకు వీలు లేకుండా బ్యాన్‌ విధించడం..రెండోది యూట్యూబ్‌లో కంటెంట్‌ క్రియేటర్లు..టిక్‌ టాక్‌ వైపు మొగ్గు చూపడంతో గూగుల్‌ పేటెంట్‌ కంపెనీ యూట్యూబ్‌కు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

భారత్‌ మినహాయిస్తే మిగిలిన దేశాల్లో అందుబాటులో ఉన్న మరో వీడియో ఫ్లాట్‌ ఫామ్‌ టిక్‌ టాక్‌ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఇటీవల విడుదలైన క్యూ1 ఫలితాల్లో గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ ఆల్ఫాబెట్‌ లాభాలు తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 26న ఈ ఒక్కరోజే గూగుల్‌ షేర్లు 3శాతం పడిపోయాయి.  

ఉక్రెయిన్‌ - రష్యా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాపారాల్లో మందగమనం ఏర్పడింది. ఫలితంగా పెట్టుబడి దారులు యూట్యూబ్‌లో తమ ప్రొడక్ట్‌లను అడ్వటైజ్మెంట్‌ చేయడం తగ్గించారు. గతేడాది యాపిల్‌ సంస్థ యాపిల్‌ సంస్థ థర్డ్‌ పార్టీ యాడ్స్‌పై నిషేదం విధించింది. ఈ నిషేదం ఫేస్‌బుక్‌ తో పాటు ఆ సంస్థకు పేటెంట్‌ కంపెనీగా ఉన్న ఇన్‌స్ట్రాగ్రామ్‌, స్నాప్‌ చాట్‌లపై పడింది. ఇక గూగుల్‌ ఆ థర్డ్‌ పార్టీ యాడ్స్‌ పై ఆధారపపడకపోయినా.. ఆ ప్రభావం గూగుల్‌ పేటెంట్‌ కంపెనీ యూట్యూబ్‌పై పడింది. 

ఈ నేపథ్యంలో మంగళవారం జరిగి యూట్యూబ్‌ ఎగ్జిటీవ్‌ మీటింగ్‌లో యూట్యూబ్‌కు వచ్చే యాడ్స్‌ తగ్గినట్లు తేలింది. ఫలితంగా ఆల్ఫాబెట్‌ క్యూ1 వార్షిక ఫలితాల్లో 14శాతం మాత్రం వృద్ధి సాధించి..6.87 బిలియన్‌ డాలర్ల ఆదాయం గడించింది. కానీ గతేడాది క్యూ1లో అల్ఫాబెట్‌ 48శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.      

సైనోవస్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో సీనియర్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ డాన్ మోర్గాన్ మాట్లాడుతూ, "యూట్యూబ్‌ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుంది. రాబోయే రోజుల్లో ఆశాజనమైన ఫలితాల్ని సాధింస్తుందని అంచనా వేశారు. అయితే యూట్యూబ్‌కు వచ్చే ఆదాయం పడిపోవడానికి ఉక్రెయిన్‌పై చేస్తున్న రష్యా దాడి పరోక్ష కారణమని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్. ఐరోపా అంతటా రాజకీయ అనిశ్చితి నెలకొందని, వ్యాపారంపై అడ్వటైజ్మెంట్‌ రూపంలో చేసే ఖర్చు తగ్గిందన్నారు.

చదవండి👉యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ భారీ షాక్‌! మరి నెక్ట్స్​ ఏంటీ?..ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించడమే

మరిన్ని వార్తలు