యూట్యూబ్‌ క్రియేటర్లకు పండగే..45 శాతం ఆదాయం

21 Sep, 2022 12:10 IST|Sakshi

సాక్షి, ముంబై: యూట్యూబ్‌ క్రియేటర్లకు పండగలాంటి వార్త. షార్ట్-ఫారమ్ వీడియో క్రియేటర్లు ఇకపై డబ్బులు సంపాదించవచ్చు.  గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన వీడియో ఫీచర్ షార్ట్‌లపై ప్రకటనలను పరిచయం చేస్తోందని తద్వారా, ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని  క్రియేటర్లకు ఇస్తామని మంగళవారం ప్రకటించింది.

ఇది చదవండి:  Tata Nexon:సేల్స్‌లో అదరహ! కొత్త వేరియంట్‌ కూడా వచ్చేసింది

టిక్‌టాక్‌ (మన దేశంలో బ్యాన్‌) తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తాజా అప్‌డేట్‌ను తీసు కొచ్చింది.  షార్ట్-ఫారమ్వీడియోపై డబ్బు సంపాదించడానికి క్రియేటర్‌ల కోసం యూట్యూబ్‌ కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. మారుతున్న డిజిటల్ ల్యాండ్‌ స్కేప్‌లో (సృష్టికర్తలకు) భారీ మద్దతునిచ్చేలా ఉండాలని  కోరుకుంటున్నామని సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్‌ ఎంటర్టైన్మెంట్ రారాజు. తన యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూనే మరోవైపు క్రియేటర్లు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శించుకునే అవకాశాన్ని కూడా కల్పించిన యూట్యూబ్‌ తాజాగా క్రియేటర్లకు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో యూజర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో యూట్యూబ్‌  ప్రకటనల  ద్వారా 14.2 బిలియన్‌ డాలర్లను  ఆర్జించింది. ఇది 2021లో ఇదే కాలంతో పోలిస్తే 9 శాతం పెరిగింది.

మరిన్ని వార్తలు