ఆండ్రాయిడ్‌లో యూట్యూబ్‌ వరల్డ్‌ రికార్డ్‌ !

24 Jul, 2021 21:02 IST|Sakshi

ప్రపంచంలో అత్యధికమంది డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌గా యూట్యూబ్‌ రికార్డు సృష్టించింది. టెక్నాలజీ ప్రపంచంలో మిగిలిన యాప్‌లను వెనక్కి నెట్టి ఇప్పుడప్పుడే ఎవ్వరీ అందనంత ఎత్తులో నిల్చుంది. 

1000 కోట్లు
ప్రస్తుతం ప్రపంచ జనాభా 790 కోట్లు, అయితే ఇప్పటి వరకు యూ ట్యూబ్‌ ఏకంగా వెయ్యి కోట్లసార్లు డౌన్‌లోడ్‌ అయ్యింది. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్లే స్టోర్‌లో ప్రస్తుతానికి 20.89 లక్షల యాప్‌లు ఉన్నాయి. వీటన్నింటీని వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో యూట్యూబ్‌ నిలిచింది. ఈ ఏడాది ఆండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫామ్‌పై కొత్తగా 300 కోట్ల యాక్టివేషన్లు వచ్చాయి. దీంతో యూట్యూబ్‌ వరల్డ్‌ రికార్డు సాధించగలిగింది. ఏకంగా ప్రపంచ జనాభాను మించి యూట్యూబ్‌ యాప్‌ వెయ్యి కోట్ల సార్లు డౌన్‌లోడ్‌ అయ్యింది. 

తర్వాత స్థానం 
ప్లే స్టోర్‌కి సంబంధించి యూట్యూబ్‌ తర్వాత స్థానంలో 700 కోట్ల డౌన్‌లోడ్లలతో ఫేస్‌బుక్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాట్సప్‌ 600 కోట్లు, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ 500 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌ 300 కోట్ల సార్లు ఆండ్రాయిడ్‌ యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

టిక్‌టాక్‌ సైతం
ఇక సంచలనాలకు కేంద్ర బిందువైన టిక్‌టాక్‌ 200 కోట్లు, సబ్‌వే సర్ఫర్‌ వంద కోట్లకు పైగా డౌన్‌లోడ్లు సాధించాయి. ఫేస్‌బుక్‌ లైట్‌, మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, మైక్రోసాఫ్ట్‌ పవర్‌ పాయింట్‌ యాప్‌లు రెండు వందల కోట్ల దగ్గరగా డౌన్‌లోడ్‌ అయ్యాయి.

మరిన్ని వార్తలు