వీడియోలు చూడటానికి ఇదే ఫేవరెట్‌!

28 Sep, 2023 07:15 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్‌లైన్‌లో వీడియోల వీక్షణకు ఎక్కువ మంది యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. ప్రతి అయిదుగురిలో నలుగురు తమ ప్లాట్‌ఫామ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు యూట్యూబ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

యూట్యూబ్‌ను ఇంటర్నెట్‌ ఆధారిత టీవీల్లో చూసే వారి సంఖ్య గణనీయంగా ఉంటోందని తెలిపింది. అలాగే యూట్యూబ్‌ షార్ట్స్‌ (తక్కువ నిడివి ఉండే వీడియోలు) సగటు రోజువారీ వీక్షణలు 120 శాతం మేర పెరిగినట్లు సంస్థ తెలిపింది. 

షార్ట్స్‌ వీక్షకుల్లో 96 శాతం మంది .. 18–44 ఏళ్ల వయస్సు మధ్య వారు ఉంటున్నారని పేర్కొంది. కంటెంట్‌ అప్‌లోడ్స్‌ 40 శాతం పెరిగినట్లు యూట్యూబ్‌ వివరించింది.   

మరిన్ని వార్తలు