Super Thanks: ఇక యూట్యూబ్‌తో డబ్బులే డబ్బులు

21 Jul, 2021 14:32 IST|Sakshi

క్రియేటర్లకు యూట్యూబ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆడియన్స్‌ నుంచి యూట్యూబ్‌ క్రియేటర్ల మనీ ఎర్నింగ్‌ చేసేందుకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ తో యూట్యూబ్‌  క్రియేటర్లు వ్యూవర్స్​ నుంచి నాలుగు రకాలుగా డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించినట్లైంది. 

షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ సంస్థలు క్రియేటర్లు మంచి కంటెంట్‌ను అందించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే వాటికి పోటీగా యూట్యూబ్‌ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. కాంపిటీటర్ల నుంచి పోటీని ఎదుర్కొనేలా యూట్యూబ్‌ క్రియేటర‍్లు డబ్బులు సంపాదించేందుకు  ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసింది. 'సూపర్ థ్యాంక్స్‌' అనే  ఫీచర్‌ ద్వారా వ్యూవర్స్ క్రియేటర్లను సపోర్ట్‌ చేస్తూ సుమారు రూ.150 నుండి రూ.3,730 వరకు చెల్లించవచ్చు.

తద్వారా తమ అభిమాన యూట్యూబ్ ఛానల్ లో మద్దతు ఇవ్వడానికి ఒక మార్గంగా ఉంటుందని  యూట్యూబ్‌ ప్రకటించింది. సూపర్‌ థ్యాంక్స్‌ ఫీచర్ నుంచి మనీ డొనేట్‌ చేస్తే వారి పేర‍్లు కామెంట్‌ సెక్షన్‌లో హైలెట్‌గా నిలుస్తాయి. ఈ ఆప్షన్‌  ప్రపంచ వ్యాప్తంగా 68 దేశాలలో ఉన్న యూట్యూబ్‌ క్రియేటర్లకు అందుబాటులో ఉంటుందని యూట్యూబ్‌ ప్రతినిథులు అధికారికంగా వెల్లడించారు. 

కాగా,ఇప్పటికే యాడ్స్‌, ఛానల్ సబ్‌స్కిప్షన్‌,లైవ్ స్ట్రీమ్‌లో సూపర్‌ చాట్‌ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండగా..మనీ ఎర్నింగ్‌ కోసం మరో ఫీచర్‌ అందుబాటులోకి తేవడంపై ఆన్‌ లైన్‌ లో మనీ ఎర్నింగ్‌ చేయాలనుకునే ఔత్సాహికులు, యూట్యూబ్‌ క్రియేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

 

మరిన్ని వార్తలు