ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. యూట్యూబ్‌ మ్యూజిక్‌ సరికొత్త ఆఫర్‌

5 Oct, 2021 12:43 IST|Sakshi

సంగీత ప్రియులకు శుభవార్త ! ఇంతకాలం పెయిడ్‌ సర్వీసుగా ఉన్న యూట్యూబ్‌ మ్యూజిక్‌ని ఇకపై కస్టమర్లకు ఫ్రీగా అందివ్వాలని గూగుల్‌ నిర్ణయించింది. ఈ ఆఫర్‌ అందుబాటులోకి వస్తే అచ్చంగా రేడియో తరహాలో ఇకపై సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.

యూట్యూబ్‌తో ఇబ్బంది
నచ్చిన పాటలు వినాలంటే అనేక యాప్‌ అందుబాటులో ఉన్నా ప్రధానంగా ఎక్కువ మంది ఉపయోగించేంది యూట్యూబ్‌. అయితే ఈ యాప్‌ ప్రధానంగా వీడియో ఆధారితమైనది కావడంతో కచ్చితంగా వీడియోను చూడాల్సి వస్తుంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ త్వరగా డ్రైయిన్‌ అయ్యేది. ఈ సమస్యను అధిగమించేందుకు గూగుల్‌ సంస్థ యూట్యూబ్‌ మ్యూజిన్‌కి అందుబాటులోకి తెచ్చింది. 
ఇకపై మ్యూజిక్‌ ఫ్రీ
‍యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్లో స్క్రీన్‌ను ఆఫ్‌ చేసి పాటలు వినొచ్చు ఇతర యాప్‌లు కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇది పూర్తిగా పెయిడ్‌ సర్వీస్‌గా అందుబాటులో ఉంది. దీంతో చాలా మందికి ఆ యాప్‌ చేరుకకాలేకపోయింది. అయితే తాజాగా ఈ సర్వీసును ఫ్రీగా అందించాలని గూగుల్‌ నిర్ణయించింది. ఎటువంటి రుసుము చెల్లించకుండానే సంగీతాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది.
మొదట అక్కడే
యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ని నవంబరు 3 నుంచి ఫ్రీ సర్వీసుగా అందిస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది. మొదట కెనడాలో ఈ సర్వీసును ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని.. ఆ తర్వాత దశల వారీగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తామని ప్రకటించింది. అయితే ఫ్రీ సర్వీసులో యాడ్స​ వస్తాయని తెలిపింది. యాడ్స​ వద్దనుకున్నవారు పెయిడ్‌ సర్వీసును ఎంచుకొచ్చని సూచించింది. 
ఎప్పుడంటే
ఇండియాలో కొన్ని హై ఎండ్‌మొబైల్‌ ఫోన్లలో బండిల్‌ ఆఫర్‌గా యూట్యూబ్‌ మ్యూజిక్‌ అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో ఈ సర్వీసు ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతాన్ని ఎంజాయ్‌ చేయోచ్చు. 

చదవండి : Windows 11: వచ్చిందోచ్‌.. మీ కంప్యూటర్‌ సపోర్ట్‌ చేస్తుందా?

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు