YouTube: మరో బంపర్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేయనున్న యూట్యూబ్‌

13 Aug, 2022 14:01 IST|Sakshi

ముంబై: ప్రముఖ వీడియోషేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కింగ్‌ యూట్యూబ్‌ మరో సరికొత్త ఫీచర్‌ను లాంచ్‌ చేయనుంది. ఎప్పటికపుడు కీలక అప్‌డేట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న యూట్యూబ్‌ త్వరలోనే YouTube స్ట్రీమింగ్ వీడియో సర్వీస్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోందట. దీనికి సంబంధించి పలు ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలతో కంపెనీ చర్చలను మళ్లీ ప్రారంభించిందని సమాచారం. 

చదవండి:  వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్‌సైట్‌, డౌన్‌లోడ్‌ లింక్‌ బ్లాక్‌
స్ట్రీమింగ్ వీడియో సేవల కోసం ఆల్ఫాబెట్‌కుచెందిన యూట్యూబ్ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం నివేదించింది. గత 18 నెలలుగా పనిలో ఉన్న సంస్థ పలు సంస్థలతో చర్చలను పునరుద్ధరించిందని పేర్కొంది. "ఛానల్ స్టోర్" తో పేరుతో పిలుస్తున్న ఈ చర్చలు పూర్తైన తరువాత ఈ సర్వీసు  అందుబాటులోకి రావచ్చని తెలిపింది.

కాగా ఈ వారం ప్రారంభంలో, వాల్‌మార్ట్ తన సభ్యత్వ సేవలో స్ట్రీమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చేర్చడం గురించి మీడియా కంపెనీలతో చర్చలు జరిపిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.కే బుల్, శాటిలైట్ టీవీ యూజర్లు సబ్‌స్క్రిప్షన్-ఆధారిత స్ట్రీమింగ్ సేవలకు మారుతున్న తరుణంలో యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. తద్వారా  రోకు, ఆపిల్‌ లాంటి కంపెనీల సరసన చేరనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై యూట్యూబ్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

చదవండివేధించకండి! రుణ రికవరీ ఏజెంట్లపై ఆర్‌బీఐ ఉక్కుపాదం!

మరిన్ని వార్తలు