Youtube: యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్‌.. డబ్బులు చెల్లించాల్సిందేనా!

4 Oct, 2022 16:35 IST|Sakshi

యూట్యూబ్‌ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకుని అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫాంగా అవతరించింది యూట్యూబ్. ప్రస్తుతం ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలలో ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో యూజర్లపై భారం మోపుతోంది. తాజాగా యూట్యూబ్‌ మరో బాదుడికి సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. యూజర్లు ఇకపై యూట్యూబ్‌లోని హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే పైసలు చెల్లించాల్సి వచ్చేలా ఉంది.

ఎలా అని ఓ లుక్కేద్దాం! సమాచారం ప్రకారం.. యూట్యూబ్‌లో 4K రెజుల్యూషన్‌ వీడియోలను యూజర్లు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తప్పనిసరి చేసే ప్లాన్‌లో ఉందట. ప్రసుత్తం యూట్యూబ్‌లో యాడ్స్‌ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉండాలి. ఇందుకోసం నెలకు రూ.129, మూడు నెలలకు రూ. 399, సంవత్సరానికి ₹1290 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ తరహాలోనే  4k వీడియోలు చూడాలంటే కూడా ప్రీమియం తప్పనిసరి చేయనున్నారని సమాచారం. ప్రస్తుతానికైతే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, యూజర్లలో దీనిపై చర్చ మాత్రం జరుగుతోంది. 4కే వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వస్తున్నట్టు కొందరు యూజర్లు రెడిట్ ప్లాట్‌ఫాంలో వివరించారు.


కొందరు యూజర్లు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్‌ చేశారు. దీని బట్టి చూస్తే త్వరలో యూట్యూబ్‌లో 4కే వీడియోలు ఉచితంగా చూడటం సాధ్యం కాకపోవచ్చు. హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం మెంబర్‌షిప్ తీసుకోవాల్సి వచ్చేలా ఉంది.
 

చదవండి: ఫ్రెషర్స్‌కి భారీ షాక్‌.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్‌!

మరిన్ని వార్తలు