YouTube : యూట్యూబ్‌లో ఈ కొత్త ఫీచర్‌ ఏదో బాగుందే..!

10 Aug, 2021 15:30 IST|Sakshi

యూట్యూబ్‌ గురించి తెలియని వారు ఏవరుండరు. మనకు నచ్చిన టీవీ ప్రోగ్రాంలను మిస్సైనా, ఇతరత్రా వీడియోలను చూడాలంటే వెంటనే యూట్యూబ్‌ యాప్‌ను ఓపెన్‌ చేస్తాం..!  మనలో చాలా మంది యూట్యూబ్‌ వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాం. యూట్యూబ్‌లో ఒక వీడియో చూస్తుంటే మనకు కాస్త నచ్చకపోయినా, లేదా తరువాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతతో ఫోన్‌లో డబల్‌ ట్యాప్‌ చేసి వీడియోలను ఫార్వర్డ్‌ చేస్తు ఉంటాం. వీడియోలను ఫార్వర్డ్‌ చేసే క్రమంలో డబుల్‌ ట్యాప్‌ సరిగ్గా చేయకపోతే తదుపరి వీడియోకు వెళ్తుంది. ఇలా మనలో చాలా మంది ఇలాంటి సమస్యను చాలా మంది ఎదుర్కోన్న వాళ్లమే..! కాగా ఈ సమస్యకు చెక్‌పెడుతూ కొత్త పరిష్కారాన్ని చూపింది యూట్యూబ్‌.  యూట్యూబ్‌ త్వరలోనే యూజర్లకు కొత్త ఫీచరును అందుబాటులోకి తీసుకురానుంది.

యూజర్లకు స్లైడ్‌ టూ సీక్‌ అనే కొత్త ఫీచరును యూట్యూబ్‌ త్వరలోనే యాడ్‌ చేయనుంది. వీడియోను చూసే సమయంలో వీడియోపై ఒక గీతపై డాట్‌ ఉండే సింబల్‌ త్వరలోనే యూజర్లకు కనిపించనుంది. సింబల్‌కు పక్కనే ‘స్టైడ్‌ టూ లెఫ్ట్‌ ఆర్‌ రైట్‌ టూ సీక్‌’డిస్క్రిప్షన్‌ మేసేజ్‌ కన్పిస్తోంది. అంతేకాకుండా ఆపిల్‌, షావోమీ స్మార్ట్‌ఫోన్లలో కన్పించే రౌండ్‌బాల్‌ హోల్డ్‌ గెస్చర్‌ను కూడా యూట్యూబ్‌ అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఒక వీడియోలో ముందుకు ఫార్వర్డ్‌ వెళ్లాలంటే బాల్‌ను డ్రాగ్‌  చేస్తే సరిపోతుంది. మనకు నచ్చినట్లుగా వీడియోలను ఫార్వర్డ్‌, రివైండ్‌ చేయవచ్చును. ప్రస్తుతం ఈ ఫీచరును యూట్యూట్‌ టెస్ట్‌ చేస్తోంది. కాగా ఈ ఫీచర్‌ యూట్యూబ్‌ యాప్‌ వెర్షన్‌ 16.31.34 వాడుతున్న ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు