యూట్యూబ్‌ కొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ వార్‌కి చెక్ పెట్టనుందా?

31 Mar, 2021 15:33 IST|Sakshi

మన నిత్యజీవితంలో యూట్యూబ్‌ ఒక భాగమైంది. తీరికగా యూట్యూబ్‌లో వీడియోలను చూస్తు కాలక్షేపం చేస్తాం. అందులో  మనకు నచ్చిన వీడియోలను లైక్‌ కొడతాం. వీడియో నచ్చక పోతే సింపుల్‌ డిస్‌లైక్‌ కొడతాం. యూట్యూబ్‌లో అత్యధికంగా డిస్‌లైక్‌లు కొట్టిన వీడియో ఏది అంటే...? ఠక్కున బాలీవుడ్‌కు చెందిన సడక్‌-2 ట్రైలర్‌ అని చెప్తాము. యూజర్లు ఈ విధంగా చేయడంతో ఒకింతా చిత్రపరిశ్రమలో చర్చకు దారి తీసింది. సడఖ్‌-2 చిత్రం తరువాత వరుణ్‌ ధవన్‌ హీరోగా నటించిన కూలీ చిత్ర బృందం లైక్‌, డిస్‌లైక్‌ బటన్‌ లేకుండా చేసింది. ఒక వీడియోపై మన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి యూట్యూబ్ డిస్‌లైక్‌ చేయడం ప్రజాస్వామ్య మార్గాలలో ఒకటిగా చెప్పుకొవచ్చు. కానీ కొంతమంది యూజర్లు వీడియోలకు దురుద్ధేశంతో డిస్‌లైక్‌లను కొట్టడం ఒక వ్యసనంగా మారింది.

ఈ సమస్యలన్నింటికీ భవిష్యత్తులో యూట్యూబ్‌ చెక్‌ పెట్టనుంది. అందుకుగాను యూట్యూబ్ వివిధ మార్గాలను పరీక్షిస్తోంది. భవిష్యత్తులో యూట్యూబ్‌లో కనిపించే వీడియోలకు డిస్‌లైక్‌ల సంఖ్య కనిపించకుండా, అసలు డిస్‌లైక్‌ బటన్‌ లేకుండా చేయబోతుంది. ప్రస్తుతం ఈ టెస్టును యూట్యూబ్‌ పరీక్షిస్తోందని ట్విటర్‌లో తెలిపింది. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ సిస్టమ్‌లలో పరీక్షించనుంది. యూజర్ల నుంచి తగు సూచనలు తీసుకున్న తరవాత ఈ ఫీచర్‌ను అమలు చేయనున్నారు. యూట్యూబ్‌ ఒకటే ఇలాంటి ఫీచర్‌ను తీసుకొని వస్తూదంటే మీరు పొరపడినట్లే. గతంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు నిజమైన యూజర్లను గుర్తించడానికి ఈ ఫీచర్‌ను పరీక్షించాయి.

చదవండి:
నెలకు రూ.36 లక్షలు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు

మరిన్ని వార్తలు