Technical Guruji: పేరుకే యూట్యూబర్! నెల సంపాదన రూ. కోటి కంటే ఎక్కువ..

11 Apr, 2023 19:16 IST|Sakshi

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన చాలా మందిలో గౌరవ్ చౌదరి ఒకరు. వృత్తిపరంగా టెక్నికల్ గురూజీ పేరుతో సుపరిచితుడైన ఈ యూట్యూబర్ దుబాయ్‌‌లో నివసిస్తున్నాడు. భారతదేశంలో ఎక్కువ మంది అనుసరించే టెక్ యూట్యూబర్ కూడా. ఈయన రెండు యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతూ కోట్ల కొద్ది సంపాదిస్తున్నారు.

గౌరవ్ చౌదరి అండ్ టెక్నికల్ గురూజీ పేరుతో రెండు యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతున్న ఇతనికి సుమారు 27 మిలియన్స్ పాలొవర్స్ ఉన్నారు. ప్రపంచంలో అతి పెద్ద టెక్ ఛానెల్‌లలో ఒకటి టెక్నికల్ గురూజీ యూట్యూబ్ ఛానెల్‌.

1991లో రాజస్థాన్‌లో అజ్మీర్‌లో జన్మించిన టెక్నికల్ గురూజీ BITS పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీని పూర్తి చేసాడు. 2015లో యూట్యూబ్ ప్రారంభించాడు. ఈ ఛానల్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే గొప్ప సక్సెస్ సాధించాడు. ఒక పక్క యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదించమే కాకుండా, దుబాయ్ పోలీసులకు, ఇతర సంస్థలకు భద్రతా సామగ్రిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు దుబాయ్ పోలీస్ సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇంజనీర్ అని సమాచారం.

ప్రస్తుతం దుబాయ్‌లో రూ. 60 కోట్ల విలువైన ఇల్లు ఉంది, అంతే కాకుండా అతడు ఇప్పటికే ఖరీదైన సుమారు 11 కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో రూ. 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెక్‌లారెన్ GT, రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే పనామెరా GTS, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్, బిఎండబ్ల్యు 750ఎల్ఐ, మెర్సిడెస్ బెంజ్ 500ఎమ్ఎల్, ఆడి ఏ6, మహీంద్రా థార్ మొదలైనవి ఉన్నాయి.

ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లను కలిగి ఉన్న టెక్నికల్ గురూజీ మొత్తం ఆస్తుల విలువ 45 మిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 369 కోట్లు. అతని నెల సంపాదన కోటి కంటే ఎక్కువే. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు