-

Yulu Wynn: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!

29 Apr, 2023 08:18 IST|Sakshi

ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుతున్న అదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి, విడుదల చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే 'యులు' (Yulu) కంపెనీ వైన్ (Wynn) అనే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర & బుకింగ్స్:
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త వైన్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 55,555 మాత్రమే (ఎక్స్-షోరూమ్). ఈ ధర కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తరువాత ఇది రూ. 64,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 999 రిఫండబుల్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ బైక్ ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత మరిన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే డెలివరీలు మే 2023 నుంచి ప్రారంభమవుతాయి.

కలర్ ఆప్షన్స్:
యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ కేవలం రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి స్కార్లెట్ రెడ్ కలర్, మూన్ లైట్ కలర్. ఇవి రెండూ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి.

(ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..)

బ్యాటరీ & రేంజ్:
యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ బజాజ్ చేతక్ యాజమాన్యంలో ఉన్న చేతక్ టెక్నాలజీస్ లిమిటెడ్ తయారు ఛేస్విది. ఇందులో 984.3 వాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 68 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు, కావున ఈ బైక్ రైడ్ చేయడానికి ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటివి అవసరం లేదు.

(ఇదీ చదవండి: ఆధార్ కార్డులో ఫోటో మార్చాలా? ఇలా చేయండి!)

కొత్త యులు వైన్ బైక్ సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ మల్టిపుల్ మొబిలిటీ ఫ్యాక్స్ పొందుతుంది. కావున బ్యాటరీ యాజ్-ఏ-సర్వీస్ సబ్స్‌స్క్రిప్షన్ మీద నెలవారీ చార్జీలను ఉపయోగించుకోవచ్చు. దీనికింద నెల చార్జీలు రూ. 499 నుంచి రూ. 899 వరకు ఉంటాయి. దీని వల్ల రైడింగ్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ఈ ప్లాన్ ద్వారా కిలోమీటరుకు 70 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. చూడటానికి బైక్ చిన్నగా ఉన్నప్పటికీ 100 కేజీలు పేలోడ్ కెపాసిటీని కలిగి ఉంటుంది.

మరిన్ని వార్తలు