బీఎస్‌ఎన్‌ఎల్‌తో యప్‌ టీవీ భాగస్వామ్యం

4 Feb, 2021 17:08 IST|Sakshi

‘‘యప్‌ టీవీ స్కోప్ ప్లాట్‌ఫామ్” లాంచ్‌

 ఒకే చందాతోప్రీమియం  ఓటీటీ సర్వీసులు 

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌తో ప్రముఖ గ్లోబల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యప్‌ టీవీ కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ అవగాహనా ఒప్పందం  ప్రకారం కొత్త సర్వీసును తన యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు తన ఓటీటీ సేవలను మరింత విస్తరించేందుకు ‘యప్‌టీవీ స్కోప్‌ ప్లాట్‌ఫాం’ను లాంచ్‌ చేసింది. ఇందులో  వినియోగదారులకు అన్ని ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు ఒకే ప్యాకేజీలో అందించనుంది. సోనీలివ్‌, జీ5, వూట్ సెలెక్ట్ అండ్‌  లైవ్ టీవీ లాంటి ప్రీమియం ఓటీటీ సర్వీసులను ఒకే ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్, ఆండ్రాయిడ్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్ ఫాంల్లో ఇది అందుబాటులో ఉండనుంది. దీంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ డివైస్‌లు, స్మార్ట్ టీవీల్లో ఓటీటీ సర్వీసులు ఎంజాయ్ చేయవచ్చు.

ఏఐ, ఎంఎల్‌ సామర్థ్యాల వినియోగంతో యప్‌ టీవీ స్కోప్ అత్యంత క్యూరేటెడ్ అనుభవాన్ని అందిస్తుందనీ, మునుపెన్నడూ లేని విధంగా కంటెంట్ ఆవిష్కరణను సులభతరం చేస్తుంది. యప్‌టీవీ వెల్లడించింది. కంటెంట్‌కోసం  పలు యాప్‌ల అవసరం లేకుండానే తమ క్రాస్-ప్లాట్‌ఫాం ద్వారా, స్మార్ట్ టీవీ, పీసీ, మొబైల్, టాబ్లెట్.. వివిధ పరికరాలకు యాక్సెస్‌ పొందవచ్చు. అలాగే వినియోగదారులు లైవ్ టీవీని చూస్తూనే  ప్రత్యక్ష చాట్‌లను నిర్వహించవచ్చు, ప్రత్యక్ష పోల్స్‌లో పాల్గొనవచ్చు. నచ్చిన కంటెంట్‌ను కూడా కోరుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌ భాగస్వామ్యంతో  సింగిల్ సబ్‌స్క్రిప్షన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ యుప్ టీవీ స్కోప్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని యప్‌టీవీ వ్యవస్థాపకుడు ,సీఈఓ  ఉదయ్ రెడ్డి వెల్లడించారు. అటు బీఎస్‌ఎనల్‌ఎల్‌ సీఎండీ  సిఎండి శ్రీ పి.కె.పూర్వర్ కూడా ఈ సేవలపై సంతోషం వెలిబుచ్చారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు