క్యూ4లో జీ లాభం నేలచూపు

27 May, 2022 01:40 IST|Sakshi

రూ. 182 కోట్లకు పరిమితం

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజ్‌(జీల్‌) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 33 శాతం క్షీణించి రూ. 182 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 272 కోట్లకుపైగా ఆర్జించింది.

మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,984 కోట్ల నుంచి రూ. 2,361 కోట్లకు బలపడింది. ప్రకటనల ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 1,120 కోట్లకు చేరింది. అయితే సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం రూ. 803 కోట్ల నుంచి రూ. 855 కోట్లకు ఎగసింది.   కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జీ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ. 956 కోట్లను తాకింది. 2020–21లో రూ. 793 కోట్లు మాత్రమే ఆర్జించింది.

మరిన్ని వార్తలు