ఎఫ్‌అండ్‌వోలో జీల్‌ కొనసాగింపు

1 Mar, 2023 04:44 IST|Sakshi

నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఎన్‌ఎస్‌ఈ  

న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ విభాగంలో మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌(జీల్‌)ను కొనసాగించనున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా ప్రకటించింది. వెరసి డెరివేటివ్స్‌ నుంచి జీల్‌ను తప్పించేందుకు గురువారం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జీల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా ప్రక్రియను వారాంతాన జాతీయ కంపెనీ చట్ట అపిల్లేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) నిలిపివేసింది.

ఎసెస్ల్‌ గ్రూప్‌లోని మరో కంపెనీ సిటీ నెట్‌వర్క్స్‌ రూ. 89 కోట్ల చెల్లింపుల్లో విఫలంకావడంపై ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ క్లెయిమ్‌ చేసింది. ఈ రుణాలకు జీల్‌ గ్యారంటర్‌గా ఉంది. కాగా..  కల్వెర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా)తో విలీనంకానున్న జీల్‌కు ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు ఉపశమనాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28 నుంచి జీల్‌ కౌంటర్‌లో తిరిగి మే నెల ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను ఎన్‌ఎస్‌ఈ అనుమతించింది. మార్చి, ఏప్రిల్‌ కాంట్రాక్టులు యథాతథంగా కొనసాగుతాయి.

మరిన్ని వార్తలు