హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ త్రీ-వీలర్లను లాంచ్‌ చేసిన జీరో 21

28 Jun, 2022 12:27 IST|Sakshi

ముంబై:  హైదరాబాద్‌కు చెందిన రెన్యువబుల్‌  ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్  జీరో 21  కొత్తగా మూడు ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలను రూపొందించింది. ప్యాసింజర్, కార్గో సెగ్మెంట్ల కోసం ఉపయోగపడే తీర్, స్మార్ట్‌ మ్యూల్‌, ఎక్స్‌ మోడల్స్‌ను సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రాణి శ్రీనివాస్‌ వీటిని ఆవిష్కరించారు. వీటితో తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో మరింతగా విస్తృతమవుతుందని పేర్కొన్నారు.

తీర్‌ను ఒక్కసారి చార్జి చేస్తే గంటకు 55 కి.మీ. గరిష్ట వేగంతో 110 కి.మీ. మైలేజ్‌ ఉంటుంది. స్మార్ట్‌ మ్యూల్‌–ఎక్స్‌ రేంజీ 125 కి.మీ.లుగా ఉంటుంది. పాత పెట్రోల్, డీజిల్‌ వాహనాలను విద్యుత్‌ వాహనాలుగా మార్చుకునేందుకు అవసరమైన రెన్యూ కన్వర్షన్‌ కిట్లను కూడా జీరో21 తయారు చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో రెన్యూ కిట్లను విక్రయిస్తోంది. అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా మాజీ ఉద్యోగి అయిన రాణి శ్రీనివాస్‌.. జీరో21ను ప్రారంభించారు. తెలంగాణలోని జహీరాబాద్‌లో ప్లాంటు ఉంది.

మరిన్ని వార్తలు