Zilingo CEO Ankiti Bose: నా వ్యక్తిగత ఫోటోలతో ఇబ్బంది పెడుతున్నారు - అంకితి బోస్‌

28 May, 2022 15:43 IST|Sakshi

చిన్న వయసులోనే స్టార్టప్‌ స్థాపించి, అతి తక్కువ కాలంలోనే యూనికార్న్‌ కంపెనీగా  తీర్చిదిద్దిన యంగ్‌ లేడీ ఎంట్రప్యూనర్‌గా ఎదిగిన అంకితి బోస్‌కి గడ్గు కాలం నడుస్తోంది. ఇప్పటికే వృత్తిగతంగా ఇబ్బందులో ఉండగా తాజాగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరింత చిక్కుల్లో పడింది.  జీవితంలో ఎన్నడూ చూడనంత విద్వేషాన్ని ఆమె ప్రస్తుతం అనుభవించాల్సి వస్తోంది. 

సింగపూర్‌ బేస్డ్‌గా జిలింగో అనే ఈ కామర్స్‌ సైట్‌ను స్థాపించి యూనికార్న్‌ కంపెనీగా ఎదిగేలా కృషి చేసింది అంకితి బోస్‌. అయితే ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో ఇటీవల సీఈవో పోస్టుకు రాజీనామా చేసి ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చారు. ఈ అనూహ్య పరిణామాలతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. మెయిన్‌స్ట్రీమ్‌ మొదలు సోషల్‌ మీడియా వరకు అంకితి బోస్‌పై పుంఖాలుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. అయితే వీటితో తనకు మనఃశాంతి కరువైంది అంకితి బోస్‌ బాధపడుతోంది. దీంతో తాను పడుతున్న ఇబ్బందులను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తెలిపారు..

పర్సనల్‌ ఫోటోలతో
జిలింగో నుంచి నేను బయటకు వచ్చాక వందల కొద్ది వార్తలు నాపై వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఎవ్వరూ నా అభిప్రాయం కోరకుండానే తమకు తోచినట్టుగా నన్ను చెడుగా చిత్రీకరిస్తూ వార్తలు రాస్తున్నారని అంకితీ అంటున్నారు. నా పర్సనల్‌ ఫోటోలు, చాట్స్‌, డాక్యుమెంట్స్‌, రికార్డ్స్‌ ఇతర విషయాలను సేకరించి ప్రచురిస్తున్నారు. నన్నొక మంత్రగత్తెలా చూపిస్తున్నారంటూ బాధను వ్యక్తం చేస్తోంది.

ఇంత ద్వేషమా
నా మీద వస్తున్న తప్పుడు కథనాల కారణంగా జనాల్లో నాపై ద్వేషం పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో నన్ను తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా ఇష్టారీతిగా దూషిస్తున్నారు. అవమానకరంగా మాట్లాడుతున్నారు. నా జీవితంలో ఇంతటి ద్వేషాన్ని నేనెప్పుడు చూడలేదంటూ వాపోతోంది  అంకితిబోస్‌. 

కుట్రపూరితంగా
నన్ను కుట్రపూరితంగా జిలింగో నుంచి తొలగించారని అంకితి బోస్‌ అన్నారు.. నా పని తీరు నచ్చలేదని, నేను నిధులు దుర్వినియోగం చేసినట్టు ఎవరో అనామక వ్యక్తి (విజిల్‌ బ్లోయర్‌) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఇది కక్షగట్టి కుట్రపూరితంగా చేసిన చర్యగా ఆమె అంటున్నారు.

చదవండి: అంకితి బోస్‌కు షాక్‌..సీఈవోగా తొలగించిన జిలింగో!

మరిన్ని వార్తలు