-

అంకితి బోస్‌కు షాక్‌..సీఈవోగా తొలగించిన జిలింగో!

20 May, 2022 15:21 IST|Sakshi

సింగపూర్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కంపెనీ జిలింగో కోఫౌండర్‌, సీఈవో అంకితి బోస్‌కు భారీ షాక్‌ తగిలింది. సంస్థ నిధుల్ని దుర్వినియోగం చేశారని విచారణలో తేలడంతో  జిలింగో  అంకితి బోస్‌ను సంస్థ నుంచి తొలగించింది. 
   

బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం..8 దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం..500మంది ఉద్యోగులు.. రూ7వేల కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు..ఇవన్నీ సాధించింది ఏ తలపండిన వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటు! భారత్‌కు చెందిన 23 ఏళ్ల యువతి. చిన్న వయసులోనే దేశం కానీ దేశంలో సంస్థను ఏర్పాటు చేసి ఇంతింతై వటుడింతై అన్న చందనా.. సంస్థను ముందుండి నడిపించారు. ఆసియా నుంచి తొలిసారిగా యూనికార్న్‌ క్లబ్‌లో అడుగుపెట్టేలా చేశారు. కానీ ఏమైందో ఏమో.. అంకితి బోస్‌ సీఈవో సాఫీగా సాగుతున్న వ్యాపారంలో అవినీతి మరక అలజడిని సృష్టించింది. 

జిలింగోలో పెట్టుబడిదారులైన టెమాసెక్, సీక్వోయా క్యాపిటల్ తో పాటు ఇతర సంస్థలు నిర్వహించిన అంతర్గత విచారణలో కంపెనీలో అవకతకలు జరిగినట్లు గుర్తించారు. ఆమెపై సస్పెన్షన్‌ విధించారు. ఈ నేపథ్యంలో మే 20న జిలింగో అంకింతి బోస్‌ను శాస‍్వతంగా విధుల నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

 

నన్ను వేధించారు
తనని జిలింగో అక్రమంగా విధుల నుంచి తొలగించిందంటూ  బ్లూమ్‌ బర్గ్‌కు తెలిపింది. కంపెనీ నిర్వహించిన ఆడిట్ రిపోర్ట్‌లో జరిగిన అవకతవకలపై బ్లూమ్‌ బర్గ్‌ ఆమెను ప్రశ్నించింది. ఆ విషయాల గురించి ఆమె స్పందించలేదు. కానీ సీఈవో హోదాలో ఉన్న తనపై వేధింపులు ఎదురయ్యాయని, ఇదే విషయంపై యాజమాన్యాన్ని నిలదీసినట్లు చెప్పింది. అలా అడిగినందుకు తనని మార్చి 31న తనపై సస్పెన్షన్‌ విధించారని తెలిపింది. గతంలో తనని వేధించారని, ఆ హరాస్‌ మెంట్‌పై బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ల ఎదుట నిలదీశానని, అందుకే తనపై అవినీతి, లేనిపోని నిందలతో కుట్ర చేసి బయటకు పంపిచినట్లు ఆరోపించారు.

చదవండి👉కష్టాల్లో అంకితి బోస్‌.. యంగ్‌లేడీ సీఈవోకి భారీ షాక్‌ !

మరిన్ని వార్తలు