Zomato IPO: మీరు చూసింది ట్రైలరే, నేను ఏకంగా సినిమా చూపిస్తా

15 Jul, 2021 12:53 IST|Sakshi

న్యూఢిల్లీ: రూ. 9,375 కోట్ల సేకరించే లక్క్ష్యంతో ప్రారంభమైన  జొమాటో  ఐపీవోలో రికార్డ్‌ స్థాయిల్ని క్రియేట్‌ చేస్తోంది. అమెరికా, చైనాలో ఫుడ్‌ డెలివరీ సంస్థ ఐపీఓల కంటే భారత్‌ కు చెందిన జొమాటో ఐపీఓ మార్కెట్‌లో సత్తా చాటుతోంది. జొమాటో ఇష్యూ ప్రైస్‌బాండ్‌ ఒక్కో షేరుకు రూ.72-76గా నిర్ణయిస్తూ రంగంలోకి దిగిన జొమాటోకి ఇన్వెస్టర్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్‌ వచ్చింది.

బీఎస్‌ఈ లెక్కల ప్రకారం జొమాటో ఐపీవో రెండో రోజు ఇప్పటి వరకు ఈ ఐపీఓలో క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్ బయర్స్‌  98శాతం సబ్ స్క్రిప్షన్ (నమోదు)  , నాన్‌ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌ 13శాతం,  వ్యక్తిగత రిటైల్ పెట్టుబడిదారులు.3.62 శాతం, ఉద్యోగులు 18శాతం మంది సబ్ స్క్రిప్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో జొమాటో ప్రతినిథులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఐపీఓ ప్రారంభానికి ముందే సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ చేసిన ట్వీట్‌ వైరల్‌ గా మారిన విషయం తెలిసిందే.  ఐపీవో ఒత్తిడిలో మూడు సార్లు బ్రేక్‌ ఫాస్ట్‌ ఆర్డర్‌ చేశానంటూ గోయల్‌ ట్వీట్‌ చేయడం వ్యాపార దిగ్గజాలు స్పందిస్తూ తమదైన స్టైల్లో గోయల్‌కి అభినందనలు చెప్పారు. గోయల్‌కు అభినందనలు వెల్లువెత్తుతుంటే జొమాటో కో ఫౌండర్‌ గౌరవ్‌ గుప్తా అభి బాకి హై మేరీ దోస్త్ అంటూ "ఇప్పటి వరకు మీరు చూసి కేవలం ట్రైలర్‌ మాత్రమే.. సినిమా చూపిస్తానంటూ ఓ టీవీ చర్చా వేదికలో డైలాగ్స్‌ పేల్చారు. ఆ డైలాగ్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా, ఐపీఓలో ఊహించని విధంగా జొమాటోకి విశేష స్పందన లభించడంతో ఇతర ఫుడ్‌ డెలివరీ సంస్థలు సైతం ఐపీఓల దిశగా అడుగులు వేస్తున్నాయి. మరి అవి ఏమేరకు ఫలితాల్ని సాధిస్తాయో వేచి చూడాల‍్సి ఉంది.  

చదవండి: వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది

మరిన్ని వార్తలు