జొమాటో ‘సీక్రెట్‌’ బయటపడింది, ఫుడ్‌ డెలివరీ స్కామ్‌..ఇలా కూడా చేయొచ్చా!

23 Jan, 2023 08:45 IST|Sakshi

మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ పెడుతున్నారా? ఆర్డర్‌ పెట్టిన ఫుడ్‌కు ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేస్తున్నారా? లేదంటే క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సీవోడీ) ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకుంటున్నారా? చేస్తే చేశారు కానీ ఆన్‌లైన్‌ పేమెంట్‌ మాత్రం చేయకండి. సీవోడీ పద్దతిలోనే డబ్బులు చెల్లించండి. ఫుడ్‌ డెలివరీ సంస్థల్ని మోసం చేసి వందల రూపాయిల్ని మీరు ఆదా చేసుకోవచ్చు. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి. 

ఫుడ్‌ ఆగ్రిగేటర్‌కు చెందిన డెలివరీ క్యాష్‌ ఆన్‌ డెలివరీతో డబ్బుల్ని ఎలా ఆదా చేసుకోవచ్చో కస్టమర్లకు చెబుతున్నాడు. అందులో ఓ కస్టమర్‌  డెలివరీ బాయ్‌ చేస్తున్న ప్రచారం గురించి నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట్లో వైరల్‌గా కాగా.. సదరు కంపెనీ సీఈవో స్పందించారు. సంస్థలోని లోపాల్ని సరిదిద్దుతామని తెలిపారు.    

ఉత్తరాఖండ్‌ చెందిన ఎంట్రప్రెన్యూర్‌ వినయ్ సతి కొద్దిరోజుల క్రితం జొమాటోలో బర్గర్స్‌ ఆర్డర్‌ పెట్టారు. ఆర్డర్‌ పెట్టిన 30 నిమిషాల తర్వాత బర్గర్స్‌ తెచ్చిన ఆ డెలివరీ బాయ్‌.. వినయ్‌తో.. ‘ సార్‌ నెక్ట్స్‌ టైం నుంచి మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేయకండి. క్యాష్‌ ఆన్‌ డెలివరీ చేయండి. ఎందుకుంటే? మీరు ఆర్డర్‌ పెట్టిన ఫుడ్‌ ఖరీదు రూ.700 నుంచి రూ.800 ఉంటే.. క్యాష్‌ ఆన్‌ డెలివరీలో కేవలం రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. మీరు నాకు రూ.200, రూ.300 ఇచ్చి రూ.1000 ఖరీదైన ఫుడ్‌ను ఆస్వాధిస్తూ ఎంజాయ్‌ చేయండి’ అంటూ సెలవిచ్చాడు.  

దీంతో షాక్‌ తిన్న వినయ్‌ తనకు ఎదురైన అనుభవాన్ని లింక్డిఇన్‌లో పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌లో...జొమాటోలోని డెలివరీ బాయ్స్‌ భారీగా మోసం చేస్తున్నారని, ఎలా మోసం చేయాలో సలహా ఇచ్చారని, జొమాటోలో స్కామ్ జరుగుతోందని విని నాకు  గూస్‌బంప్స్ వచ్చాయి. ఇక, జొమాటో డెలివరీ బాయ్‌ చెప్పినట్లు ఆఫర్‌ను ఎంజాయ్‌ చేయాలా? లేదంటే మోసాన్ని బహిర్ఘతం చేయాలా? అని ప్రశ్నించారు.

నేను ఎంట్రప్రెన్యూర్‌ను కాబట్టి సెకండ్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకున్నా. అందుకే మీ ముందుకు వచ్చానంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. కాగా.. ఆ పోస్ట్‌ పై జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ స్పందించారు. కంపెనీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం : వినయ్ సతి

ప్రతీకాత్మక చిత్రం : వినయ్ సతి పోస్ట్‌పై జొమాటో సీఈవో స్పందన
 

చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్‌

మరిన్ని వార్తలు