-

భారత్‌లో బిర్యానీతో పాటు ఇది కూడా చాలా ఫేమస్..?

28 Dec, 2021 18:06 IST|Sakshi

మోమోస్ ఫుడ్ భారతదేశంలో రికార్డుల మీద రికార్డు సృష్టిస్తుంది. ఈ మోమోస్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తినే వంటకంగా నిలచింది. ఇటీవల ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో విడుదల చేసిన నివేదికలో కూడా అదే విషయం వెల్లడైంది. జొమాటో నివేదిక ప్రకారం, 2021లో 1.06 కోట్లకు పైగా వినియోగదారులు ఈ మోమోలను ఆర్డర్ చేశారు. కరోనా మహమ్మారి కాలంలో కూడా మోమోస్ ఆహారాన్ని ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు జొమాటో తెలిపింది. భారత్‌లో బిర్యానీతో పాటు మోమోస్ కూడా చాలా ఫేమస్ ఆహారంగా నిలుస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 

జొమాటోలో అత్యంత ఎక్కువ మంది తినే ఆహార జాబితాలో మోమోస్ అగ్రస్థానంలో ఉంది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో గత ఏడాది 2021లో బిర్యానీని ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. భారతదేశంలో ప్రతి సెకనికి ఒక బిర్యానీని డెలివరి చేసినట్లు కంపెనీ తెలిపింది  ఆ తర్వాత 2వ స్థానంలో దోసాను 8.8 మిలియన్లకు పైగా ఆర్డర్ చేసిన వంటకంగా వెల్లడించింది. అక్టోబర్ నెలలో జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీ20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జొమాటో నుంచి 10,62,710 మంది ఆన్ లైన్ ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఒక అహ్మదాబాద్ కస్టమర్ 2021లో రూ.33,000 విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు జొమాటో తెలిపింది. జొమాటో, స్విగ్గీలలో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహారంగా బిర్యానీ నిలిచింది.

(చదవండి: అద్భుతం.. మైండ్‌తో ట్వీట్‌ చేసిన తొలి వ్యక్తి!)

మరిన్ని వార్తలు