Zomato: ‘జొమాటో ఉద్యోగులకు భారీ షాక్‌!’

19 Nov, 2022 17:53 IST|Sakshi

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వారాల వ్యవధిలో ముగ్గురు ఉన్నత స్థాయి ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేశారు. ఈ తరుణంలో జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం వర్క్‌ ఫోర్స్‌లో 4 శాతం మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

నష్టాల్లో ఉన్న సంస్థలో  ఖర్చును తగ్గించి లాభసాటిగా మార్చేందుకు దేశ వ్యాప్తంగా ప్రొడక్ట్‌, టెక్నాలజీ, కేటలాగ్‌, మార్కెటింగ్‌ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని జొమాటో ఫైర్‌ చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆ ఉద్యోగులు విధులకు హాజరుకావడం లేదని సమాచారం. 

ఉత్పత్తిని పునరుద్ధరించే సమయంలో మిడ్‌లెవల్‌ ఉద్యోగల నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్థాయిలో విధుల నిర్వహించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి తొలగింపులు అనివార్యమైనట్లు తెలుస్తోంది. 

కాగా, ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ ఇచ్చే అంశంపై ఇప్పటికే జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ సంస్థ ఉద్యోగులకు సమాచారం అందించారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగల్ని తొలగిస్తామని చెప్పారు. ఇప్పుడు సీఈవో చెప్పినట్లుగానే తొలగింపులు ఉంటున్నాయని నివేదిక హైలెట్‌ చేసింది. 

నష్టాల్లో జొమాటో 
జాతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్ధిక మాంద్యంతో పాటు ఇతర కారణాల వల్ల 2022-2023 క్యూ2 లో నిరాశాజనకమైన ఫలితాల్ని  రాబట్టింది. సెప్టెంబర్‌ నెల ముగిసే సమయానికి జొమాటో రూ.251కోట్లు నష్టపోయింది.

చదవండి👉 నాన్నకు రోడ్డు ప్రమాదం..డెలివరీ బాయ్‌గా ఏడేళ్ల బాలుడు

మరిన్ని వార్తలు