Zomato Q1 Results 2022: హమ్మయ్యా.. జొమాటో నష్టాలు తగ్గాయి

2 Aug, 2022 08:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర నష్టాలు దాదాపు సగానికి తగ్గి రూ. 186 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 361 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 917 కోట్ల నుంచి రూ. 1,582 కోట్లకు ఎగసింది.

అయితే మొత్తం వ్యయాలు రూ. 1,260 కోట్ల నుంచి రూ. 1,768 కోట్లకు పెరిగాయి. బ్లింకిట్‌ కొనుగోలు ప్రతిపాదనకు వాటాదారుల నుంచి 97 శాతం ఓట్లు లభించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో దీపీందర్‌ గోయల్‌ వెల్లడించారు. స్టాక్‌ ఎక్సే్ఛంజీల నుంచి అనుమతి రావలసి ఉన్నదని సీఎఫ్‌వో అక్షంత్‌ గోయల్‌ పేర్కొన్నారు. బ్లింకిట్‌ కొనుగోలుకి సాధ్యాసాధ్యాల పరిశీలన చేపట్టడంతోపాటు విలువ విషయంలో తీవ్రస్థాయిలో చర్చలు నిర్వహించినట్లు తెలియజేశారు.  ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.7 శాతం నీరసించి రూ. 46.50 వద్ద ముగిసింది.

చదవండి: భారత్‌కు ఉబర్‌ గుడ్‌బై, స్పందించిన ఈవోసీ

మరిన్ని వార్తలు