సెప్టెంబర్ 17 నుంచి జొమాటోలో ఆ సేవలు బంద్

12 Sep, 2021 16:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారం జొమాటో తన కిరాణా డోర్ డెలివరీ సేవలను సెప్టెంబర్ 17 నుంచి నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల నుంచి ఆశించినంత రీతిలో స్పందన రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది. గ్రోఫర్స్ సంస్థ ఇతర కిరాణా సంస్థల కంటే మెరుగైన ఫలితాలను సృష్టిస్తుందని నమ్ముతున్నట్లు కంపెనీ తెలిపింది.(చదవండి: ఇండియన్‌ మార్కెట్‌లో మరో ఎలక్ట్రికల్‌ వెహికల్‌)

జొమాటో తన కిరాణా భాగస్వాములకు ఒక ఈ-మెయిల్ లో ఇలా పేర్కొంది.. "జొమాటో మా వినియోగదారులకు అత్యుత్తమ సేవలు, మా వ్యాపార భాగస్వాములకు మరిన్ని లాభాలను అందించాలని మేము ఆశించాము. మా కస్టమర్లకు, మర్చంట్ భాగస్వాముల ప్రొడక్ట్ డెలివరీ చేయడానికి ప్రస్తుత మోడల్ అత్యుత్తమ మార్గం కాదని మేము విశ్వసిస్తున్నాము. అందువల్ల, మా పైలట్ కిరాణా డెలివరీ సేవలను 17 సెప్టెంబర్, 2021 నుంచి నిలిపివేయాలని మేం భావిస్తున్నాం'' అని పేర్కొంది.

దీని గురుంచి జొమాటో ప్రతినిధిని సంప్రదించినప్పుడు.. "మేము మా కిరాణా పైలట్ మూసివేయాలని నిర్ణయించుకున్నాము. ప్రస్తుతానికి మా ప్లాట్ ఫారమ్ పై కిరాణా డెలివరీ సేవలు అందించడానికి ప్రణాళికలు లేవు. గ్రోఫర్స్ 10 నిమిషాలలో కిరాణాలను అందిస్తూ మార్కెట్లో మొదటి స్థానంలో ఉంది" అని అన్నారు. కిరాణా డెలివరీ ఫ్లాట్ ఫారం గ్రోఫర్స్ లో మైనారిటీ వాటాను పొందడానికి 100 మిలియన్ డాలర్లు (సుమారు ₹745 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు ఇంతకు ముందు జొమాటో పేర్కొంది.

మరిన్ని వార్తలు