గోగోరోతో చేతులు కలిపిన జొమాటో.. ఎందుకో తెలుసా?

30 Mar, 2023 21:06 IST|Sakshi

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. దీనికి తోడు కొన్ని ఈ కామర్స్ కంపెనీలు, ఫుడ్ డెలివరీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో గోగోరో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆ కంపీనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. కాగా ఇప్పుడు జొమాటో 2023 చివరి నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించాలని కంకణం కట్టుకుంది. ఈ కారణంగానే గోగోరోతో చెయ్యి కలిపింది.

జొమాటో డెలివరీ ఏజంట్లకు మరింత అనుకూలంగా ఉండటానికి కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ లోన్ సదుపాయం కూడా అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అంతే కాకుండా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీ ఆప్సన్ కలిగి ఉండటం వల్ల వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

(ఇదీ చదవండి: జిమ్నీ డెలివరీలు అప్పుడే అంటున్న మారుతి సుజుకి)

ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రిమూవబుల్ బ్యాటరీ ఉండటం వల్ల ప్రత్యేకంగా బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఒక బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయినప్పుడు స్వాపింగ్ సెంటర్ వద్ద ఇంకో బ్యాటరీ తీసుకోవచ్చు. ఇది వినియోగదారునికి చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.

మరిన్ని వార్తలు