ZOOM: ఏ భాషలో చెప్పినా.. మన భాషలో వినిపిస్తుందిట !

30 Jun, 2021 16:39 IST|Sakshi

లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌పై జూమ్‌ ఫోకస్‌

మెషిన్‌ ట్రాన్స్‌లేషన్‌ ‘కైట్స్‌’ టేకోవర్‌

జూమ్‌లో తొలగనున్న లాంగ్వేజ్‌ ప్రాబ్లెమ్‌ 

వర్చువల్‌ సమావేశాలు మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా నూతన టెక్నాలజీని జూమ్‌ అందుబాటులోకి తేబోతుంది. విభిన్న ప్రాంతాలు, వేర్వేరు భాషలకు చెందిన ప్రజలు ఇబ్బంది లేకుండా మాట్లాడుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో జూమ్‌ బిజీగా ఉంది. 

మరింత సమర్థంగా
మాట్లాడుతుండగానే ఒక భాషను అనువైన భాషలోకి తర్జుమా చేసి చెప్పే టెక్నాలజీతో దూసుకుపోతున్న జర్మనీకి చెందిన కైట్స్‌ సంస్థను జూమ్‌ టేకోవర్‌ చేసింది. కైట్స్‌కి సంబంధించిన సాంకేతికతను ఉపయోగించి వర్చువల్‌ మీటింగ్స్‌ మరింత సమర్థంగా ఉండేలా చూస్తామంటూ జూమ్‌ ప్రకటించింది. అంతేకాదు  కైట్స్‌కి చెందిన  ఇంజనీర్లు  మెషిన్‌ ట్రాన్స్‌లేషన్‌లో మరిన్ని నూతన ఆవిష్కరణలు చేస్తారని, అవి తమ యూజర్లకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయని జూమ్‌ తెలిపింది.

ఇప్పటికే ఉన్నా
వర్చువల్‌ మీటింగ్‌లో విభిన్న భాషలు మాట్లాడేప్పుడు తర్జుమా చేసే ఫీచర్‌ను  ఈ ఏడాది ప్రారంభంలో  జూమ్‌ ప్రవేశపెట్టింది. అయితే మీటింగ్‌ జరిగేప్పుడు ఇతర శబ్ధాలు వినిపించినా, కొన్ని భాషలకు సంబంధించి స్థానిక యాసల్లో మాట్లాడినా, పదాలు పలికేప్పుడు స్పస్టత లోపించినా.... వాటిని అనువదించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా​యి. దీన్ని అధిగమించేందుకు మెషిన్‌ ట​‍్రాన్స్‌లేషన్‌లో మెరుగైన సంస్థగా ఉన్న కైట్స్‌ని జూమ్‌ టేకోవర్‌ చేసింది. 
 

చదవండి : Incom Tax : జులై 1 నుంచి కొత్త టీడీఎస్‌ రూల్స్

మరిన్ని వార్తలు