11వేలలో 5జీ ఫోన్

3 Dec, 2020 13:29 IST|Sakshi

11 వేలలో 5జీ మొబైల్ ను చైనాలో విడుదల చేసింది జెడ్‌టీఈ కంపెనీ. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ స్మార్ట్‌ఫోన్ ను 2 డిసెంబర్ 2020న విడుదల చేసింది. ఇది 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీని ధర 999 చైనా యువాన్లు (సుమారు రూ.11,200), ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ తో పనిచేయనుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అందించారు. (చదవండి: భారత్‌లో షియోమీని బ్యాన్ చేయండి)

జెడ్‌‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ స్పెసిఫికేషన్లు
జెడ్‌‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఫోన్ 6.52-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. జెడ్‌‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ 4జీబీ ర్యామ్, మైక్రో SD కార్డ్ ద్వారా 512జీబీ వరకు విస్తరించగల 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ తో వస్తుంది. జెడ్‌‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఆండ్రాయిడ్ 10 ఆధారంతో మిఫావర్ 10 ఆపరేటింగ్ సిస్టంపై నడవనుంది. ఇది 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరాల విషయానికొస్తే, వెనుక వైపున ఉన్న జెడ్‌‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను f/1.79 ఎపర్చర్‌తో, f/2.2 ఎపర్చర్‌తో రెండవ 8 మెగాపిక్సెల్ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో మూడవ 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. ఇది సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. జెడ్‌‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. జెడ్‌‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ 188 గ్రాముల బరువు ఉంటుంది. ఇది స్పేస్ గ్రే, ఫాంటసీ బ్లూ మరియు స్పేస్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. జెడ్‌‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉంది. జెడ్‌‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఫేస్ అన్‌లాక్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అందించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధరను 999 యూరోలుగా(సుమారు రూ.11,200) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యూరోలుగా(సుమారు రూ.15,700) నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు