Zuckerberg: భారీ షాక్‌! 71 బిలియన్ డాలర్లు తుడుచుపెట్టుకుపోయాయ్‌!

20 Sep, 2022 13:33 IST|Sakshi

గ్లోబల్‌ బిలియనీర్ల  ఎలైట్‌ క్లబ్‌లో 20వ స్థానానికి పడిపోయిన జుకర్‌ బర్గ్‌

న్యూఢిల్లీ: ‘మెటా’ అభివృద్ధి, రీబ్రాండింగ్‌పై దృష్టిపెట్టిన ఫేస్‌బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు భారీ షాక్‌ ఇస్తోంది. మార్క్‌ సంపద భారీగా తాజాగా మరింత క్షీణించింది. ఫలితంగా కేవలం 55.9 బిలియన్ డాలర్ల నికర విలువతో  మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచ బిలియనీర్‌లలో 20వ స్థానంలో ఉంది, 2014 నుండి  ఇదే అత్యల్ప స్థానం. ఈ సంపద రెండేళ్ల కిందటే 106 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. 

మెటా డెవలప్‌మెంట్‌ కోసం దాదాపు 71 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నారు. ఫలితగా మార్క్‌ సంపద ఈ మేరకు తుడుచుపెట్టుకుపోయింది. బ్లూమ్‌బెర్గ్  బిలియనీర్స్  ఇండెక్స్  ప్రకారం అత్యంత సంపన్నులలో అతని నికర సంపద సగానికి  తగ్గిపోయింది.  2014లో  ప్రపంచ బిలియనీర్లలో రెండు స్థానంలో ఉన్నారు ఇటీవల కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో 24 శాతం పడిపోయాయి.  అంచనాలకు భిన్నంగా మెటా బలహీన ఫలితాల కారణంగా చరిత్రలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అలా ఒక్క రోజులోనే మార్క్‌ సంపద 31 బిలియప్‌ డాలర్లకు పడిపోయింది. సెప్టెంబర్, 2021లో కంపెనీ షేర్లు 382 డాలర్ల వద్ద  జుకర్‌ బర్గ్‌ అతని సంపద గరిష్టంగా 142 బిలియన్‌ డాలర్లగా ఉన్న సంగతి తెలిసిందే.

మెటావర్స్‌లో కంపెనీ పెట్టుబడులు పెట్టడం వల్ల స్టాక్ డ్రాప్ అవుతోందనీ, రాబోయే మూడు నుండి ఐదేళ్లలో  "గణనీయమైన" సంపద కోల్పోతుందని తాను భావిస్తున్నట్లు నీధమ్ అండ్‌  కంపెనీ ఇంటర్నెట్ విశ్లేషకుడు లారా మార్టిన్ చెప్పారు. 
 

మరిన్ని వార్తలు