జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ ఫేజ్‌-2 పూర్తి

3 Nov, 2020 14:18 IST|Sakshi

మూడో దశ పరీక్షలు డిసెంబర్‌లో

ఈ నెలలో డీసీజీఐకు రెండో దశ డేటా

2021ఏప్రిల్‌కల్లా క్లినికల్‌ పరీక్షల తుది డేటా

తొలి అర్ధభాగంలో వ్యాక్సిన్‌ విడుదల చేసే యోచన

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి అభివృద్ధి చేస్తున్న జైకోవి-డి వ్యాక్సిన్‌పై రెండో దశ పరీక్షలు పూర్తయినట్లు జైడస్‌ క్యాడిలా తాజాగా వెల్లడించింది. డిసెబర్‌లో మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించే యోచనలో ఉ‍న్నట్లు కంపెనీ ఎండీ షార్విల్‌ పటేల్‌ తెలియజేశారు. ఫేజ్‌-3లో 15,000-20,000 మందిపై పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. రెండో దశ పరీక్షల డేటాను ఈ నెలలో దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు అందించనున్నట్లు తెలియజేశారు. రెండో దశ పరీక్షలలో భాగంగా 1,000 మంది వొలంటీర్లపై వ్యాక్సిన్‌ను ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఈ డేటా విడుదల తదుపరి మూడో దశ పరీక్షలకు వెంటనే అనుమతి లభించగలదని భావిస్తున్నట్లు చెప్పారు. 2021 మార్చి-ఏప్రిల్‌కల్లా వ్యాక్సిన్‌ పరీక్షల తుది డేటాను సిద్ధం చేయగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి 20201 తొలి అర్ధభాగంలో వ్యాక్సిన్‌ను విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు