ఫ్రెండ్స్‌తో స్టెప్పులేసిన స్టార్‌ హీరో కూతురు

12 Nov, 2020 14:49 IST|Sakshi

‌సాక్షి, ముంబై: బాలీవుడ్‌ ‘సింగం’ అజయ్‌ దేవగణ్‌-కాజోల్‌ దంపతుల గారాల పట్టి నైసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ప్రస్తుతం సింగపూర్‌లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా నైసా తన స్నేహితులతో కలిసి‌ సరదాగా డ్యాన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో నైసా తన ఇద్దరు స్నేహితులకు సులభంగా డ్యాన్స్‌ స్టెప్పులు ఎలా వేయాలో నేర్పిస్తుంది. ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే అనేకమంది వీక్షించారు. ఈ వీడియో చూసిన వారంతా ‘డ్యాన్స్‌ మెలుకువలు నేర్పుతూ ఎంతైనా నటుడి కుమార్తె అనిపించుకుంది’ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. (చదవండి: అతనితో జాగ్రత్తగా ఉండమన్నారు: కాజోల్‌)

కాగా నైసా స్టార్‌ సెలబ్రిటీ కూతురు అయినప్పటికీ ఆమె చాలా సాధారణంగా ఉంటారు. ఇతర సెలబ్రిటీల్లా లాగా సోషల్‌ మీడియాలో కూడా ఎక్కవ కనిపించరు. తన విషయాలు, ఫోటోలు అందరికి కనిపించకుండా గోప్యంగా ఉంచుతారు. ఇక కాజోల్‌, అజయ్‌ దేవగణ్1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2003లో కూతురు నైసా, 2010లో కుమారుడు యుగ్‌ దేవగణ్‌ జన్మించారు. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌లో నెపోటిజంపై చర్చలు, స్టార్‌ కిడ్స్‌ పై ట్రోలింగ్‌ చర్చ సందర్భంగా నైసా దేవగణ్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘.స్టార్‌ హీరోల పిల్లలగా  ఉండటం స్టార్‌డమ్‌ తో పాటు ఒక్కోసారి ఇబ్బందులు తెస్తాయి. తాము ఏ చిన్న తప్పు చేసినా విమర్శించేందుకు సమాజంలో చాలా మంది ఉంటార’ని సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేసింది.  (చదవండి: క్షమాపణ కోరిన ప్రముఖ ర్యాప్‌ సింగర్‌)

oh @nysadevgan girl hmu and I’ll teach u how to twerk...for free! • #nysadevgan

A post shared by (@nysadevganx) on

మరిన్ని వార్తలు