‘ఆరు అడుగుల బుజ్జిబాబు’

26 Nov, 2020 20:18 IST|Sakshi

నటుడు కార్తిక్‌ ఆర్యన్ సోదరి కృతికా తివారీ పోస్ట్‌

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కార్తీక్ ఆర్యన్ నవంబర్ 22న తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన సోదరి కృతికా తివారీ సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, '6 అడుగుల బుజ్జి బాబు' అంటూ అతడిని ఆశీర్వదిస్తున్న ఫొటో పోస్ట్‌ చేసింది. దీంతో పాటు ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో లాక్‌డౌన్‌ సమయంలో అతడు ఇంట్లో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయి. 

లాక్‌డౌన్‌ కారణంగా అన్నింటికి పేకప్‌ చెప్పి ముంబైలోని తన కుటుంబంతో కార్తీక్ ఆర్యన్ ఎక్కువ సమయాన్ని గడిపాడు. ఈ మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు ఆకట్టుకున్నాడు. త్వరలోనే హర్రర్-కామెడీగా తెరకెక్కుతున్న ‘భూల్ భూలైయా 2’ సినిమా షూటింగ్‌లో తిరిగి పాల్గొనున్నట్టు తెలిపాడు. ఇందులో కియారా అద్వానీ, టబు నటిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా తను కొత్తగా ‘ధమాకా’ పేరుతో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి నీర్జా ఫేమ్ దర్శకుడు రామ్ మాధ్వానీ తెరకెక్కించబోతున్నారు. ఇందులో కార్తీక్ ముంబై ఉగ్రవాద దాడులను కవర్ చేసే జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. లవర్‌ బాయ్‌గా పాపులర్‌ అయిన ఆర్యన్‌ ఈ సారి కొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Read latest Celebrities News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా