ఆయుర్వేద ఆస్పత్రిలో మెరుగైన వసతులు

21 Mar, 2023 01:36 IST|Sakshi

తిరుపతి తుడా: ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిని ఆధునికీకరించి మెరుగైన వసతులు కల్పించనున్నట్టు టీటీడీ జేఈఓ సదా భార్గవి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశా ల, ఆస్పత్రిని సోమవారం అధికారులతో కలిసి ఆమె వివిధ విభాగాలను పరిశీలించా రు. అనంతరం జేఈఓ మాట్లాడుతూ వివిధ విభాగాలకు అవసరమైన ఇన్‌ఫాస్ట్రెక్చర్‌తోపాటు ఫర్నీచర్‌, ఫ్లోరింగ్‌, ఇతర ఇంజినీరింగ్‌ పనులను చేపట్టనున్నట్టు చెప్పారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఓపీడీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆస్పత్రి అహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. అనంతరం ఎస్వీ ఆయుర్వేద కళాశాలలోని తరగతి గదు లు, మ్యూజియం, గ్రంథాలయం, ఇతర విభాగాలను పరిశీలించారు. ఆయుర్వేద వైద్య విద్యార్థినుల హాస్టల్‌ భవనంలోని గదులను, డైనింగ్‌ హాల్‌, కిచెన్‌ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఈ నాగేశ్వరరావు, ఎఫ్‌ఏఅండ్‌ సీఏఓ బాలాజీ, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు , డీఈఓ భాస్కర్‌రెడ్డి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్‌ సునీల్‌, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, ఆయుర్వేద ఆస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ రేణుదీక్షిత్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు