దసరాకు ప్రత్యేక బస్సులు

12 Oct, 2023 05:16 IST|Sakshi

చిత్తూరు రూరల్‌: దసరా సెలవుల రద్దీని దృష్టిని ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడిపిపేందుకు ఆర్టీసీ అధికారులు ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ప్రధానంగా చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు 8 సర్వీసులు నడపనున్నారు. డీపీటీవో జితేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాలకు అదనంగా సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఈబస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయమని తెలిపారు. ఇతర పట్టణ ,గ్రామీణ ప్రాంతాలకు కూడా బస్సుల కొరత లేకుండా నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సంస్థకు లాభం చేకూర్చడంతోపాటు గమ్యాలకు సురక్షితంగా చేరాలని కోరారు.

ఈ–శ్రమ్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు

చిత్తూరు కార్పొరేషన్‌: అసంఘటిత రంగ కార్మికులు ఈ–శ్రమ్‌ కార్డు పొందాలని జిల్లా కార్మికశాఖాధికారి ఓంకార్‌రావు తెలిపారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ పొందని 16–59 వయస్సు ఉన్న కార్మికులు ఈకార్డును పొందేందుకు అర్హులన్నారు. చిత్తూరులోని పాత కలెక్టరేట్‌లో గల కార్మికశాఖ కార్యాలయంలో సందేహాల నివృత్తి కోసం 6302263078 నంబరుతో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈకార్డు ఉంటే వలస కార్మికులు రేషన్‌ దుకాణంలో బియ్యం తీసుకోవచ్చని, ప్రమాద బీమా రూ.2 లక్షలు వస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు