జగనన్నతోనే సంతోషం శాశ్వతం

20 Nov, 2023 00:36 IST|Sakshi

పుత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ప థకాలతో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, ఈ సంతోషం శాశ్వతం కావాలంటే మళ్లీ జగనన్న సీఎం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆదివారం వడమాలపేట మండలం పాదిరేడు సచివాలయ పరిధిలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి జగనన్న పాలనపై ప్ర జాతీర్పును అడిగారు. ప్రతి ఇంటా జగనన్న పాల నకు 10కి 10 మార్కులు వేసి, మళ్లీ జగనన్నే రావాలంటూ నినదించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ జగనన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంతకం చేసిన క్షణం నుంచి రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే ధ్యే యంగా పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్న డూ లేని విధంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. రాష్ట్రానికి సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని, అందుకు జగనన్న ను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమలవుతున్న అమ్మఒడి, వైఎస్సార్‌ పింఛన్‌ కానుక, జగనన్న విద్యాదీవెన, వసతి దీవె న, రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చే దోడు, వైఎస్సార్‌ బీమా తదితర సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించా రు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల లబ్ధితో ప్రతి పేదవాడి మోములో ఉన్న చిరునవ్వు శాశ్వతం కా వాలంటే జగన్‌ మళ్లీ రావాలని తేల్చి చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మోసపూరిత వాగ్దానాలను గుప్పిస్తోందని చెప్పా రు. ఇందుకు పచ్చమీడియా పనికట్టుకుని ప్రచారం నిర్వహిస్తోందన్నారు. గతంలో తాము చేసిన మంచిని చెప్పి, ఓట్లు అడిగే స్థితిలో టీడీపీ లేదని, అందు కే అసత్య ప్రచారాలతో ప్రజల ముందుకు వస్తోందని ఆరోపించారు. అదే జగనన్న చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని రాసిన బోర్డులను గ్రామాల్లో ఏర్పా టు చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ప్రతి కుటుంబానికి మంచి చేస్తున్న జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కరుణాకర్‌చౌదరి, శేఖర్‌, సురేష్‌రాజు, నందయ్య, ఉమాపతి, సుదర్శన్‌, మురళి, మునిబాబు పాల్గొన్నారు.

పాదిరేడులో మంత్రి ఆర్కే రోజా పల్లెనిద్ర

మరిన్ని వార్తలు