ముక్కంటి ఆలయ ఈఓగా రామారావు

20 Nov, 2023 00:36 IST|Sakshi

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ నూతన ఈఓ గా కేఎస్‌ రామారావు నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కుటుంబసభ్యులతో కలిసి స్వామి అ మ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. గతంలో ఆయన శ్రీకాళహస్తి ఆర్డీఓగా విధులు నిర్వర్తించారు.అనంతరం విజయవాడ కనకదుర్గ ఆలయానికి ఈఓగా బదిలీపై వెళ్లారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓగా బాధ్యతలు చేపట్టారు. రామారావు మాట్లాడుతూ ముక్కంటి ఆలయంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతమన్నారు. పాలకమండలి, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆలయాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు