టూరిజం కారిడార్‌గా కార్వేటినగరం

1 Mar, 2024 01:36 IST|Sakshi
● ప్రభుత్వ సహకారంతో రాణిమహల్‌ అభివృద్ధి ● డిప్యూటీ సీఎం నారాయణస్వామి

కార్వేటినగరం: సంస్థానాధీశులు నిర్మించిన చారి త్రక కట్టడాలను ఆధునీకరించి పూర్వవైభవం తీసుకొచ్చి కార్వేటినగరాన్ని టూరిజం కారిడార్‌గా మా ర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రాణిమహల్‌(లక్ష్మీమహల్‌)ను పర్యాటక శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ రమణప్రసాద్‌తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 900 సంవత్సరాల క్రితం కార్వేటినగరం సంస్థానాధీశులు నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక స్థానిక ఎంపీపీ లత, సర్పంచ్‌ ధనుంజయవర్మ రాణిమహల్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని, పట్టుపట్టడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై సీఎం జగనన్న సానుకూలంగా స్పందించి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆనాటి రాజులు ఈ భవనాలను ప్రభుత్వానికి స్వాధీనం చేయడంతో సుమారు 75 ఏళ్లపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలగా వినియోగించుకున్నట్లు చెప్పారు. అలాగే వేణుగోపాలస్వామి ఆలయం, స్కంధపుష్కరిణితో పాటు ఆళత్తూరు వరద వేంకటేశ్వస్వామి ఆలయం, కొటార్వేడు గ్రామంలో వెలసిన అగస్తీశ్వరస్వామి ఆలయం, పెనుమూరులో కనిగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం, పాలసముద్రం మండలంలో మఠవలంలో వెలసిన గోవర్ధనేశ్వరస్వామి ఆలయాలను టూరిజం పరిధిలోకి చేర్చుతామన్నారు. రాణిమహల్‌ ఆధునీకరణకు సహకరించిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కేరోజా, ఎంపీ మిథున్‌రెడ్డి, రాష్ట్ర విద్యా కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌, జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

త్వరితగతిన పూర్తి చేస్తాం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం నారాయణస్వామి చొరవతో చేపట్టనున్న రాణిమహల్‌ ఆధునీకరణ పనులను నాణ్యతగా చేపట్టి త్వరగా పూర్తి చేస్తామని టూరిజం శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ రమణప్రసాద్‌ అన్నారు. మార్చి మొదటి వారంలో భవనం ఆధునీకరణకు భూమిపూజ చేస్తామన్నారు. భవిష్యత్‌లో రాణిమహల్‌ను మ్యూజియంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే ఎంపీపీ లత, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీ, సర్పంచ్‌ ధనంజయవర్మ, స్థానిక నాయకులు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రీజనల్‌ డైరెక్టర్‌ రమణప్రసాద్‌కు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్కియాలజిస్టు అడ్మినిస్టేషన్‌ అధికారి అపర్ణ, డీఈ శ్రీనివాసులు, ఏడీ పవన్‌కుమార్‌. ఎంఈఓలు విజయకుమార్‌, మనోజ్‌కుమార్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ విజయులురెడ్డి, హెచ్‌ఎం కోటేశ్వర రావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు