ఆటో–బైక్‌ ఢీ: ముగ్గురికి తీవ్రగాయాలు

1 Mar, 2024 01:36 IST|Sakshi

వి.కోట: ఎదురెదురుగా వస్తున్న ఆటో, ద్విచక్రవాహణం ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తు లు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. పో లీసుల వివరాల మేరకు.. బైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామానికి చెందిన శివరాజ్‌ (48), శ్రీనివాసులు(30), మంజునాథ్‌( 32) ఆటోలో వారి స్వగ్రామనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని వి.కోట–పలమనేరు జాతీయ రహదారిలోని టోల్‌గేట్‌ వద్ద ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని బైక్‌ను ఢీకొనడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది .ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆటోడ్రైవర్‌ శ్రీనివాిసులు, శివరాజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనం ద్వారా క్షతగాత్రులను వి.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుప్పం పీఈఎస్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగప్ప తెలిపారు.

whatsapp channel

మరిన్ని వార్తలు