కాణిపాకం ఆలయానికి 6 కేజీల బంగారం వితరణ

1 Mar, 2024 01:36 IST|Sakshi

కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని అంతరాలయంలో బంగారు వాకిలి పనులు గురువారం రాత్రి ప్రారంభించారు. బంగారు వాకిలి తాపడం కోసం ఎన్‌ఆర్‌ఐలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌ వారి ప్రతినిధి గొట్టిపాటి రాజేంద్రప్రసాద్‌ గురువారం రాత్రి ఆలయ చైర్మన్‌ మోహన్‌ రెడ్డి, ఈఓ వెంకటేశుకు బంగారును బిస్కెట్‌ రూపంలో 6 కిలోలు విరాళంగా అందించారు. ఎన్‌ఆర్‌ఐలు తమ కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి బంగారు వాకిలి తాపడం కోసం బంగారం తీసుకురాగ వారికి ఆలయ చైర్మన్‌, ఈఓ స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయంలో బంగారానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వాద మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐలు స్వామివారి అంతరాలయంలో బంగారు వాకిలి, తాపడానికి అయ్యే ఖర్చు సుమారు రూ.5 కోట్లు అందిస్తామని చెప్పారు. వెంటనే పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, కాంట్రాక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి, శ్రీధర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అంతరాలయంలో బంగారు వాకిలి పనుల కోసం ఎన్‌ఆర్‌ఐల విరాళం

సుమారు రూ.5 కోట్లతో పనులు ప్రారంభం

whatsapp channel

మరిన్ని వార్తలు