నిస్పక్షపాతంగా పని చేయండి

1 Mar, 2024 01:38 IST|Sakshi

చిత్తూరు అర్బన్‌: జిల్లాలోని ప్రతీ ఒక్క పోలీసు అధికారి నిస్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలపై మరింత దృష్టి సారించాలని చిత్తూరు ఎస్పీ జాషువా ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా పలువురు ఎస్‌ఐలను బదిలీ చేసిన నేపథ్యంలో, వారితో గురువారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఎక్కడా కూడా చిన్న ఆరోపణ లేకుండా విధులు నిర్వహించాలని, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు