● వీరమాసి చెరువుకు కృష్ణా జలాలు

1 Mar, 2024 01:38 IST|Sakshi

కుప్పానికి హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయి. కాలువల ద్వారా చెరువులకు నీరు చేరుతోంది. బుధవారం మిట్టపల్లి సమీపంలోని మద్దికుంట చెరువు నిండిన తరువాత గురువారం అత్తికుప్పం సమీపంలోని వీరమాసి చెరువుకు నీటిని విడుదల చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హంద్రీ–నీవా కాలువ ద్వారా కుప్పానికి కృష్ణాజలాలను విడుదల చేయడంపై కుప్పం ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌ సీపీ నేతలు బోర్‌వెల్‌ చెంగారెడ్డి, చంద్రమోహన్‌ రెడ్డి, కేశవరెడ్డి, కుమార్‌ రెడ్డి, అశోక్‌ పాల్గొన్నారు. – రామకుప్పం

whatsapp channel

మరిన్ని వార్తలు