బురిడీ బాబుకు రెస్ట్‌ అవసరం

2 Mar, 2024 12:15 IST|Sakshi
లబ్ధిదారులకు మెగా చెక్‌ అందిస్తున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ

పలమనేరు : ఎన్నికల సమయంలో హామీలు గుప్పిస్తూ ప్రజలను బురిడీ కొట్టించాలని యత్నించే చంద్రబాబుకు ఇక రెస్ట్‌ అవసరమని, ఆ మేరకు జనం ఓట్ల ద్వారా తీర్పునివ్వాలని ఎమ్మెల్యే వెంకటేగౌడ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మొరం గ్రామంలో నిర్వహించిన వైఎస్సార్‌ ఆసరా చెక్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 652 ఎస్‌హెచ్‌జీలకు రూ.5.36 కోట్ల మెగా చెక్‌ను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో బ్యాంకుల్లోని నగలు మీ బీరువాల్లోకి వస్తాయని ఊకదంపుడు హామీలు ఇచ్చిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో మహిళలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రుణమాఫీ పేరిట రైతులను ముంచారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాగానే ఉత్తిత్తి హామీల చిట్టా విప్పుతున్నారని ఆరోపించారు. నాటి చంద్రబాబు పాలనకు, నేటి జగనన్న సుపరిపాలనకు తేడా తెలియాలంటే ఒక్కసారి బ్యాంకు పాసుపుస్తకాలు చూస్తే చాలని చెప్పారు. అందులో లావాదేవీలను పరిశీలిస్తే ప్రభుత్వం ఎంత మేలు చేసింతో అర్థమవుతుందని వెల్లడించారు. మంచికి, చెడుకు జరిగే ఈ పోరులో ఎవరి పక్షాన నిలవాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. కేవలం ఓట్ల కోసమే వచ్చే టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని స్పష్టం చేశారు. బాలాజీ సూపర్‌ బజార్‌ అధ్యక్షుడు సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ పలమనేరులో టీడీపీని బతికించిన తననే చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన జగనన్నకు ప్రజలే మొత్తం 175 స్థానాలు కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంఘం మండల అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ హేమంత్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ రోజా, పార్టీ మండల కన్వీనర్‌ బాలాజీనాయుడు, రాష్ట్ర కార్యదర్శి రంగన్న, సచివాలయాల మండల కన్వీనర్‌ తిరుమల, వైస్‌ ఎంపీపీ గజేంద్ర, మనోజ్‌రెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షులు కృష్ణవేణి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రాజారెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే వెంకటేగౌడ

whatsapp channel

మరిన్ని వార్తలు