రికార్డుల పరిశీలన

2 Mar, 2024 12:15 IST|Sakshi
హాల్‌ టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
గుడిపాల మండలంలోని ఉపాధి కార్యాలయంలో శుక్రవారం డ్వామా పీడీ రికార్డులు పరిశీలించారు.
– IIలో

తొలిరోజు ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు

16,139 మంది విద్యార్థుల హాజరు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌లకు తావు లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మొత్తం 17,036 మంది విద్యార్థులకు గాను 16,139 మంది హాజరయ్యారు. 897 మంది గైర్హాజరయ్యారు. సకాలంలో రావాలని అధికారులు చేసిన సూచనలతో విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పిల్లల సౌకర్యార్థం ఆర్టీసీ అదనపు బస్సులు నడిపింది. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఆయా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.

వెబ్‌కాస్టింగ్‌లో పర్యవేక్షణ

జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో పరీక్షల తీరును పరిశీలించేందుకు ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిత్తూరులోని పీసీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉన్న డీవీఈఓ కార్యాలయం నుంచి ఇంటర్మీడియట్‌ డీవీఈఓ సయ్యద్‌ మౌలా పర్యవేక్షించారు.

‘ఆదర్శ’లో అడ్మిషన్‌కు దరఖాస్తులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఆదర్శ (మోడల్‌) పాఠశాలల్లో ఆరో తరగతి అడ్మిషన్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ దేవరాజు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుంచి www. apms. apcfss. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఏప్రిల్‌ 21వ తేదీన ఆయా మోడల్‌ స్కూల్‌లో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు డీఈఓ, ఎంఈఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.

whatsapp channel

మరిన్ని వార్తలు