క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా నిఘా

2 Mar, 2024 12:15 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ షణ్మోహన్‌, పక్కన ఎస్పీ జాషువా

చిత్తూరు కలెక్టరేట్‌ : రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా నిఘా పెట్టాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు విస్తృత స్థాయి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. తనిఖీల్లో పట్టుబడే నగదు, ఇతర వస్తువులను సీజ్‌ చేయడంపై అవగాహన పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం యాప్‌ వినియోగంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. సమావేశంలో ఎస్పీ జాషువా పాల్గొన్నారు.

పకడ్బందీ ఏర్పాట్లు

సార్వత్రిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ షణ్మోహన్‌ తెలిపారు. శుక్రవారం విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చిత్తూరులోని క్యాంప్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫారమ్‌ 6,7,8 పరిష్కారం, ఎపిక్‌ కార్డుల ముద్రణ, పంపిణీని చేపట్టినట్లు వివరించారు. ఈ నెల 4, 5 తేదీల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ మీటింగ్‌ హాల్‌లో ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. కాన్ఫరెన్స్‌లోడీఆర్‌ఓ పుల్లయ్య, ఎన్నికల విభాగం సిబ్బంది ఉమాపతి, మనోజ్‌ పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు