● ఆవులపబ్బం.. అంగరంగ వైభవం

2 Mar, 2024 12:15 IST|Sakshi

చౌడేపల్లె మండలం పరికిదొనలో రెండు రోజులుగా నిర్వహించిన ఆవులపబ్బం శుక్రవారంతో ముగిసింది. గడ్డంవారిపల్లె, పరికిదొన, ఆమినిగుంట పంచాయతీల్లోని పన్నెండు గ్రామాలకు చెందిన మహిళలు ఉదయమే పిండి దీవెలు, నెయ్యిదీపాలతో ఊరేగింపుగా మేళతాళాల నడుమ కాటమరాజుల ఆలయానికి చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో కాటమరాజు , నడివీధి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సకాలంలో కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఆవులపబ్బం సందర్భంగా పరికిదొన భక్తులతో కిక్కిరిసింది. – చౌడేపల్లె

whatsapp channel

మరిన్ని వార్తలు