బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చుకోవాలి!

5 Oct, 2020 12:07 IST|Sakshi

షార్జా:  ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అనుసరించిన బ్యాటింగ్‌ ఆర్డర్‌పై భారత్‌ జట్టు మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా మండిపడ్డారు.  229 భారీ లక్ష్య ఛేదనలో ఇయాన్‌ మోర్గాన్‌ వంటి ఆటగాడిని 6వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడమేంటని కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌, కోల్‌కతా జట్టు మానేజ్‌మెంట్‌ను ఆయన ప్రశ్నించారు. గత ఏడాది కాలంగా చూసుకుంటే మోర్గాన్‌ 170 స్ర్టైక్‌రేట్‌తో ఆడుతున్నాడని, ఐపీఎల్‌లో గత రెండు మ్యాచుల్లో కూడా అద్భుతంగా ఆడాడని ఆయన అన్నాడు. మోర్గాన్‌ ఈ మ్యాచ్‌లో 44 (18) పరుగులు చేయగా అందులో ఐదు సిక్సులు బాదాడు.  షా​ర్జాలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతులో 18 పరుగుల తేడాతో కోల్‌కతా ఓడిపోయింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మోర్గాన్‌ను ముందు పంపించి ఉంటే ఆ జట్టు గెలిచి ఉండేదని ఆకాశ్‌ చోప్రా అన్నారు. 

కుల్‌దీప్‌ స్థానంలో వచ్చిన రాహుల్‌ త్రిపాఠిని 8వ స్థానంలో పంపడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. సునిల్‌ నరైన్‌ ఓపనర్‌గా రాణించనప్పుడు రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని సూచించాడు. రాహుల్‌ మంచి ఓపనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ అని... శుభమన్‌ గిల్‌తో పాటు ఓపనింగ్‌ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఆకాశ్‌ చోప్రా గతంలో కోలకతా​ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. 

(ఇదీ చదవండి: చెన్నై చిందేసింది)

మరిన్ని వార్తలు