WTC Final: 250కి పైగా పరుగులు చేస్తే టీమిండియాదే పై చేయి..

20 Jun, 2021 16:31 IST|Sakshi

సౌతాంప్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 250 పైగా పరుగులు చేస్తే మ్యాచ్‌పై పట్టు బిగించవచ్చని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో 250 మెరుగైన స్కోరేనని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ చక్కని భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారని ఆదివారం ఓ స్పోర్ట్స్‌ చానెల్‌తో మాట్లాడుతూ అన్నాడు.

టీమిండియా ఇంకా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని చెప్పుకొచ్చారు. కొత్త బంతిని ఓపెనర్లు రోహిత్‌, శుభ్‌మన్‌ చక్కగా ఎదుర్కొన్నారని రాథోడ్‌ పేర్కొన్నాడు. అయితే, ఓపెనర్లు క్రీజు బయట స్టాన్స్‌ తీసుకుంది స్వింగ్‌ను ఎదుర్కోవడానికా? దూకుడుగా ఆడటానికా? అని ప్రశ్నించగా.. 'బ్యాటింగ్‌ అంటేనే పరుగులు చేయడం. రోహిత్‌, గిల్‌ పట్టుదలగా ఆడారు. వీలైనప్పుడల్లా పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. వారిని కచ్చితంగా అభినందించాల్సిందే. విరాట్‌, రహానె బ్యాటింగ్‌ చేసిన తీరుకు హ్యాట్సాఫ్‌' అని రాథోడ్‌ అన్నాడు.

చదవండి:WTC Final Day 3: మరో బిగ్‌ వికెట్‌.. కెప్టెన్‌ కోహ్లి ఔట్‌

మరిన్ని వార్తలు