ఇంగ్లండ్‌కు భారీ షాక్‌: న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఆర్చర్‌ దూరం

17 May, 2021 16:02 IST|Sakshi

లండన్‌: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. గాయం కారణంగా భారత్‌ పర్యటన, ఐపీఎల్‌లకు దూరమైన ఆర్చర్‌.. కౌంటీ క్రికెట్‌లో ససెక్స్‌ తరపున పునరాగమనం చేశాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో కేవలం ఐదు ఓవర్లు బౌలింగ్‌ చేసిన వెంటనే మైదానాన్ని వీడాడు. 

ఇంగ్లాండ్‌, ససెక్స్‌ సీమర్‌ జోఫ్రా ఆర్చర్‌ వచ్చే నెల న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకున్నాడని ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. బౌలింగ్‌ చేసేటప్పుడు అతని కుడి మోచేయి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్‌ చివరి రెండు రోజులలో బౌలింగ్‌ చేయలేకపోయాడని ఈసీబీ వివరించింది. ఇంగ్లండ్,న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ జూన్ 2న లార్డ్స్ మైదానంలో ప్రారంభంకానుంది.
చదవండి: శ్రీ‌లంక ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత

Read latest Cricket News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు