కోహ్లీ‌ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది

10 Nov, 2020 20:01 IST|Sakshi

ఆస్ట్రేలియాతో జరుగబోయే సిరీస్‌లోని మొదటి టెస్ట్‌ తర్వాత  మిగతా సిరీస్‌ మొత్తానికి  భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌  విరాట్‌కోహ్లి దూరం కావడం  ఒకింతా ఆశ్చర్యం, నిరాశకు గురిచేశాయనిఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్‌ వా పేర్కొన్నాడు. ఒక వైపు కరోనాతో నష్టాల్లో ఉన్న బ్రాడ్‌ కాస్ట్‌లకు విరాట్‌ సిరీస్‌ మధ్యలో వైదొలగడం ఎదురుదెబ్బేనని అభిప్రాయపడ్డాడు. అతని గైర్హాజరుతో ప్రతిష్టాత్మక బోర్డర్‌- గవాస్కర్‌ సిరీస్‌ వెలితిగా ఉండబోతుందన్నారు. కోహ్లి భార్య అనుష్కశర్మ జనవరిలో మొదటి సంతానానికి జన్మనివ్వబోతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విరాట్కి డిసెంబర్‌ 17 మొదలయ్యే అడిలైడ్‌ టెస్ట్‌ తర్వాత భారత్‌ వెళ్లడానికి  అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవా మట్లాడుతూ.. భారత జట్టులో కోహ్లి లేకపోవడంతో ఆస్ట్రేలియాకు గెలిచే అవకాశాలు మెరుగయ్యాయన్నాడు.

‘ఈ సిరీస్‌ అతని  కెరీర్లో లో మంచి సీరీస్‌గా మిగిలిపోగదు.  కానీ కొన్నిసందర్భాల్లో కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. విరాట్‌ ఆడకపోతే సిరీస్‌ ఏమీ ఆగిపోదు.. కానీ ఆడితే బాగుంటుందన్నారు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా జట్టులో వార్నర్‌ కానీ స్మిత్‌ లేనపుడు భారత్‌ గెలిచినట్లు ఆస్ట్రేలియా గెలిస్తే అలానే ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన ఇలాంటి సిరీస్‌ లో బలమైన ప్రత్యర్థితో తలపడితేనే బాగుంటుంద’ని స్టీవ్‌ వా అభిప్రాయపడ్డాడు. ఏది ఏమైనా విరాట్‌ సేవలు కోల్పోతున్నప్పటికీ భారత జట్టుకు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ జట్టులో చేరనుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. బూమ్రా, రోహిత్‌, కేఎల్ ‌రాహుల్‌ లాంటి నాణ్యమైన ఆటగాళ్లు ఉండటంతో ఎప్పటికీ బలమైన ప్రత్యర్థే. సిరీస్‌ రసవత్తరంగా ఉంటుందని’ స్టీవా జోస్యం చెప్పారు.

క్రికెట్‌ ఆస్ట్రేలియా తాత్కాలిక ముఖ్య కార్యనిర్వాహక అధికారి నిక్‌ హక్‌లీ సిడ్ని రెడియోతో మాట్లాడుతూ.. విరాట్‌ నిర్ణయంపై స్పందించారు. ఇటువంటివి సాధారణంగా జరుతాయని తెలిపారు. భారత క్రికెట్‌ జట్టు ఈ వారమే ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. 2 వారాల క్వారంటైన్‌ ముగిసిన తర్వాత నవంబర్‌ 17న వన్డే మ్యాచ్‌తో సిరీస్‌ని ప్రారంభించనుంది. ‌కోహ్లి తొలి మూడు వన్డే, టీ-ట్వంటీ మ్యాచ్‌లకు కోహ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడు. 4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్‌కి ప్రాతినిధ్యం వహించిన తర్వాత భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నాడు. 2వ టెస్ట్‌ మ్యాచ్‌ డిసెంబర్‌ 26న మెల్‌బొర్న్‌లో, మూడవది జనవరి 7 న సిడ్నిలో, 4వది జనవరి 15 న  బ్రిస్బేన్‌ లో జరుగనున్నవి. కరోనా వైరస్‌ నేపథ్యంలో  ఈ సిరీస్‌ ఆసాంతం కఠిన బయో బబుల్‌ వాతావరణంలో జరుగనున్నది.


 

.

Read latest Cricket News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా